iDreamPost
android-app
ios-app

లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరోతో సినిమా!

లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరోతో సినిమా!

తెలుగు పరిశ్రమలో హీరోయిన్లకు కొదవ ఉండదు. ఎంత మంది నటీమణులు వచ్చినా.. ఇంకొకరికి చోటు ఇస్తూనే ఉంటుంది. ఒకసారి స్ట్రైక్ అయితే చాలు హీరోయిన్‌ను నెత్తిన పెట్టుకుని కాదు కాదూ గుండెల్లో గుడి కట్టేసుకుంటారు ప్రేక్షకులు. ఇక దర్శక నిర్మాతలకు కూడా వారే చాయిస్ అవుతుంటారు. అయితే నటనతో పాటు అవగింజంత అదృష్టం ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే అవకాశాలు క్యూ కడుతుంటాయి. ఇటీవల కాలంలో అలా వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది శ్రీలల. సుమారు 8-10 సినిమాలను లైన్లో పెట్టిందని తెలుస్తోంది. ఇప్పుడు మరో హీరోయిన్ వరుస ఆఫర్లను కొల్లగొడుతోంది. ఇంతకు ఆ భామ ఎవరునుకుంటున్నారు.

‘ఉరికే, ఉరికే మనస్సే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే’ అంటూ హిట్-2 మూవీలో అలరించిన మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనాలు నిలుపరాదు అంటూ సుశాంత్ సరసన నటించిన ఈ చిన్నది.. ఆ తర్వాత రవితేజ ఖిలాడీలో మెరిసింది. అయితే ఆమెకు పేరు వచ్చింది మాత్రం అడివి శేష్ నటించిన హిట్ మూవీతోనే. అప్పటి నుండి ఆమె వరుస అవకాశాలు కొల్లగొడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం నుండి పూజా హెగ్గే ఔట్ అయ్యాక.. మీనాక్షి చౌదరికి ఆఫర్ వచ్చింది. దీంతో తక్కువ సినిమాలతోనే సూపర్ స్టార్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అలాగే వరుణ్ తేజ్‍తో మట్కా సినిమా చేస్తోంది. విశ్వక్ సేన్‌తో సినిమాకు సైన్ చేసింది. అలాగే డైనమిక్ హీరో దుల్కర్ సల్మాన్ , వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ లో కూడా ఆమె ఫైనల్ అయ్యింది.

ఇప్పుడు మరో భారీ ఆఫర్‌ను కొల్గగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దళపతి విజయ్ 68వ చిత్రం కోసం మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారని సమాచారం. ఈ సినిమా కోసం ప్రియా అరుళ్ మోహన్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఈ మేకింగ్ కొత్త టెక్నాలీజీని ఉపయోగించనున్నట్లు గతంలో దర్శకుడు వెల్లడించిన సంగతి విదితమే. లియో తర్వాత రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో మీనాక్షి ఫైనల్ అయితే..  ఇది మామాలు ఆఫర్ కాదూ.  కుంభస్థలాన్ని కొట్టినట్లే. కోలీవుడ్ నుండి ఈ అవకాశం లభిస్తే.. అక్కడ కూడా బిజీ హీరోయిన్ గా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి కాదు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş