Somesekhar
హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంస్థ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంస్థ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంస్థ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు.వీలైనంత త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా సంస్థ సాధించిన విజయాలను, భవిష్యత్ లో చేపట్టబోయే కార్యాచరణలను కూడా వివరించారు. మరి ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు? పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని బస్ భవన్ లో కూడా దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆ సంస్థ ఎండీ సజ్జనార్ హాజరైయ్యారు. ఈ స్పెషల్ డే నాడు తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సజ్జనార్. అమరవీరులకు నివాళులు అర్పించి.. టీజీఎస్ ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
“గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి వాడకంలోకి తీసుకొచ్చాం. అలాగే మహాలక్ష్మీ పథకంతో పెరిగిన రద్దీ దృష్ట్యా మరో 2000 వేల డీజిల్, 990 ఎలక్ట్రికల్ బస్సులను దశల వారీగా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇక మహాలక్ష్మీ పథకానికి ముందు సగటున రోజూ 45 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం 55 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 7 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను అమలు చేసి.. 21 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించాం. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను కూడా అమలు పరిచాం” అని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పుకొచ్చారు.