iDreamPost

విరాట్ కోహ్లీని విమర్శిస్తే.. అత్యంత డేంజరస్ గా మారతాడు.. హెచ్చరించిన ఆసీస్ దిగ్గజం!

విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీపై విమర్శలు చేస్తే.. అతడు మరింత డేంజరస్ గా మారతాడని హెచ్చరించాడు ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్.

విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీపై విమర్శలు చేస్తే.. అతడు మరింత డేంజరస్ గా మారతాడని హెచ్చరించాడు ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్.

విరాట్ కోహ్లీని విమర్శిస్తే.. అత్యంత డేంజరస్ గా మారతాడు.. హెచ్చరించిన ఆసీస్ దిగ్గజం!

ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగుల వరదపారిస్తున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 634 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. అయినా గానీ.. విరాట్ పై విమర్శలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. అందరికంటే అద్భుతంగా ఆడుతున్నా.. అతడి వల్లే ఆర్సీబీకి పరాజయాలు వస్తున్నాయని మాజీలు, కొందరు నెటిజన్లు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్, తక్కువ స్ట్రైక్ రేట్ అంటూ కోహ్లీని టార్గెట్ చేసి మరీ విమర్శిస్తున్నారు. అయితే వారి విమర్శలకు తన బ్యాట్ తోనే కౌంటర్ ఇస్తున్నాడు రన్ మెషిన్. ఈ క్రమంలోనే కోహ్లీని విమర్శిస్తే.. అతడు మరింతగా ప్రమాదకరంగా మారడతాడని హెచ్చరించాడు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్.

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఈ నేపథ్యంలో కోహ్లీపై వస్తున్న విమర్శలు, అతడి ఆటతీరుపై స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మాథ్యూ హెడెన్. “గత కొన్ని రోజులుగా కోహ్లీపై వస్తున్న విమర్శలను చూస్తూనే ఉన్నా. అతడి స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఫార్మాట్స్ లో గొప్ప ప్లేయర్ గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. పైగా కోహ్లీ టెక్నికల్ గా అద్బుతమైన ఆటగాడు. మ్యాచ్ లాస్ట్ వరకూ పోరాడే వ్యక్తిత్వం కలవాడు కోహ్లీ. ఆ విషయం ఎన్నో మ్యాచ్ ల్లో చూశాను. అలాంటి ప్లేయర్ ను విమర్శిస్తే.. తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తాడు. అదీకాక అతడిని విమర్శిస్తే.. ఇంకా డేంజరస్ గా మారతాడు జాగ్రత్త” అంటూ కింగ్ కోహ్లీని విమర్శించే వారికి హెచ్చరికలు పంపాడు హెడెన్.

కాగా.. ఈ సీజన్ లో విరాట్ ప్రదర్శన అద్బుతం అంటూనే స్పిన్ లో ఇంకా మెరుగుపడాలని సూచించాడు హెడెన్. స్పిన్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 138 ఉందన్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇక వచ్చే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీని అడ్డుకునేందుకు పవర్ ప్లేలో స్పిన్నర్లను ఉపయోగించి అతడిని అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ముందే సూచించాడు. అందుకే ప్రత్యర్థిపై దూకుడు పెంచాలి అంటే.. స్పిన్ బౌలింగ్ లోనూ విరాట్ ఫాస్ట్ గా ఆడాలని హెడెన్ పేర్కొన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి