iDreamPost

భారీ అగ్ని ప్రమాదం.. ఆరు అంతస్తుల్లో చెలరేగిన మంటలు!

Fire Accident at Mumbai: ప్రస్తుతం శీతాకాలం కావడంతో చాలా మంది వీధుల్లో చలిమంటలు వేస్తుంటారు. కొన్నిసార్లు అవి ప్రమాదాలకు దారి తీస్తూ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

Fire Accident at Mumbai: ప్రస్తుతం శీతాకాలం కావడంతో చాలా మంది వీధుల్లో చలిమంటలు వేస్తుంటారు. కొన్నిసార్లు అవి ప్రమాదాలకు దారి తీస్తూ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

భారీ అగ్ని ప్రమాదం.. ఆరు అంతస్తుల్లో చెలరేగిన మంటలు!

ఇటీవల దేశంలో పలు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళకు గురి చేస్తున్నాయి. మానవ తప్పిదాలు, కరెంట్ షాక్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాధారణంగా పెద్ద పద్ద భవనాలు, షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్థలు, బాణా సంచా పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పని సరి ఉంచాలి.. ఇది ప్రభుత్వ నిబంధన. కానీ కొంతమంది నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే.. సమయానికి ఫైర్ సేఫ్టీ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చాలా మంది బయట చలి మంటలు వేస్తుంటారు.. కొన్నిసార్లు వాటి వల్ల ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ ఆరు అంతస్తుల భవనంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. డోంబీవాలిలో ఓ బహుళ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. డోంబివాలీలోని లోథా పలావా టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంలోని ఐదు, ఆరవ అంతస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడి 18వ ఫ్లోర్ వరకు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది చేరుకున్నారు. చుట్టు పక్కల స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ భవనం ఇంకా నిర్మాణ దశలో ఉంది. మూడు ఫ్లోర్లలో కొన్ని కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నారు. వారందరినీ బయకు తీసుకువచ్చారు రిస్క్యూ టీమ్. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని తెలుస్తుంది. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ హాని కలగకపోవడంతో అంతా ఊరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి