iDreamPost

March 4th Releases : అయిదు సినిమాలతో థియేటర్ల సందడి

March 4th Releases : అయిదు సినిమాలతో థియేటర్ల సందడి

రేపు మరో శుక్రవారం బాక్సాఫీస్ సందడికి రంగం సిద్ధమయ్యింది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని బరిలో దిగుతుండగా కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ యూత్ ని లక్ష్యంగా పెట్టుకుంది. భీమ్లా నాయక్ రెండో వారంలోనూ స్ట్రాంగ్ రన్ కొనసాగించే అవకాశం ఉండగా వీటితో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ కూడా మూవీ లవర్స్ ని గట్టిగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో దీనికే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం. అమితాబ్ బచ్చన్ ఝున్డ్ సైతం మంచి అంచనాలే మోసుకొస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండగా మీడియా ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

వీటి మధ్య గొడవ ఎందుకు లెమ్మని దుల్కర్ సల్మాన్ – కాజల్ అగర్వాల్ – అదితి రావు హైదరి కాంబినేషన్ లో రూపొందిన హే సినామిక ఒక రోజు ముందే అంటే ఈ రోజు 3వ తేదీనే థియేటర్లలో వచ్చేసింది. యూత్ ఫుల్ గా కనిపిస్తున్నప్పటికీ పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో మనవాళ్ళ దృష్టి దీని మీద అంతగా పడలేదు. ఒకవేళ టాక్ చాలా బాగుందని వస్తే అప్పుడు పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే పైకి భారీగా చెప్పుకునే సినిమా ఏదీ లేదు కానీ అన్నీ మౌత్ టాక్స్, రివ్యూల మీద ఆధాపడ్డవే. బ్యాట్ మ్యాన్ మనకు సంబంధం లేని వ్యవహారమే కానీ నగరాల్లో దీని ప్రభావం అంత ఈజీగా కొట్టిపారేయలేనిది.

ఈ సినిమాలన్నీ ఎంత చేసినా మార్చి 11లోపే. రాధే శ్యామ్ వస్తోంది కనక థియేటర్లు దానికి రెడీ అయిపోతాయి. ఆపై రెండు వారాల్లో ఆర్ఆర్ఆర్ ఉంటుంది కాబట్టి వసూళ్ల ప్రభంజనం మాములుగా ఉండదు. అఖండ నుంచి భీమ్లా నాయక్ దాకా చూసుకుంటే స్టార్ హీరోలు ఉండి సినిమా కంటెంట్ మెప్పించేలా ఉంటే చాలు జనం బాగా ఆదరించారు. కానీ వీటి స్థాయితో పోలిస్తే మీడియం రేంజ్ చిత్రాలకు స్పందన తక్కువగా ఉంది. నాగార్జున బంగార్రాజు సైతం అరవై కోట్లను దాటలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు రాబోతున్నవి ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తాయో  వేచి చూడాలి. ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తోంది శర్వాకే

Also Read : Pawan Kalyan : అంతుచిక్కని పవన్ రీమేక్ ప్లాన్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి