iDreamPost

Hey Sinamika Report : హే సినామిక రిపోర్ట్

కాజల్ అగర్వాల్ అదితి రావు హైదరి లాంటి గ్లామర్ అట్రాక్షన్స్ ఉండటంతో తెలుగులోనూ దీనికి మంచి స్పందన దక్కుతుందన్న నమ్మకంతో ఒకేరోజు మూడు భాషల్లో తీసుకొచ్చారు. బృందా దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ కు గోవింద వసంత్ సంగీతం సమకూర్చారు.

కాజల్ అగర్వాల్ అదితి రావు హైదరి లాంటి గ్లామర్ అట్రాక్షన్స్ ఉండటంతో తెలుగులోనూ దీనికి మంచి స్పందన దక్కుతుందన్న నమ్మకంతో ఒకేరోజు మూడు భాషల్లో తీసుకొచ్చారు. బృందా దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ కు గోవింద వసంత్ సంగీతం సమకూర్చారు.

Hey Sinamika Report : హే సినామిక రిపోర్ట్

మహానటి, కనులు కనులు దోచాయంటే సినిమాలతో మనకూ బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన హే సినామిక సాంప్రదాయక శుక్రవారం విడుదలకు బదులు ఒక రోజు ముందు ఇవాళే థియేటర్లలో అడుగు పెట్టింది. కాజల్ అగర్వాల్ అదితి రావు హైదరి లాంటి గ్లామర్ అట్రాక్షన్స్ ఉండటంతో తెలుగులోనూ దీనికి మంచి స్పందన దక్కుతుందన్న నమ్మకంతో ఒకేరోజు మూడు భాషల్లో తీసుకొచ్చారు. బృందా దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ కు గోవింద వసంత్ సంగీతం సమకూర్చారు. ట్రైలర్ చూస్తే కలర్ ఫుల్ గా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందేమోననే ఆసక్తి రేపిన ఈ సినామిక ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఆర్యన్(దుల్కర్ సల్మాన్) మోనా(అదితి రావు హైదరి)లది అందమైన పెళ్ళైన జంట. కానీ ఇద్దరికీ  సరైన అన్యోన్యత ఉండదు. ఆర్యన్ ప్రవర్తన చెడుగా లేకపోయినా అతని ప్రేమ మరీ అతిగా ఉండటంతో మోనా విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మానసిక వైద్యురాలు మలార్(కాజల్ అగర్వాల్)ని కలుస్తుంది. అయితే అనూహ్యంగా మలార్, ఆర్యన్ లు ప్రేమలో పడి మోనాకు షాక్ ఇస్తారు. ఇక అక్కడి నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు మలార్ ఎందుకలా చేసింది, ఆర్యన్ నిజంగానే తన భార్యను దూరం చేసుకోవాలనుకున్నాడా లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

మంచి క్యాస్టింగ్ ని పెట్టుకుని డైరెక్షన్ డెబ్యూ చేసిన కొరియోగ్రాఫర్ బృందా ఇంత అవుట్ డేటెడ్ కథా కథనాలు ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి లైన్లు గతంలో ఎన్నో చూశాం. ఆ మధ్య వచ్చిన సుమంత్ మళ్ళీ మొదలైంది కూడా ఇదే షేడ్స్ లో సాగుతుంది. కానీ ఎంటర్ టైనింగ్ గా సాగాల్సిన ఈ డ్రామాను బృందా సరిగా హ్యాండిల్ చేయలేక బోరింగ్ గా మార్చేశారు. నెరేషన్ మరీ నీరసంగా ఉండటంతో ఇంటర్వెల్ అయ్యాక కూర్చోవాలా వద్దా అనే అయోమయం కలుగుతుంది. సంగీతం ఒక్కటే కొంత ఊరట. కనీస లాజిక్స్ కూడా మిస్ చేసారు. ఎంత ఫ్రీ టైం ఉన్నా సరే రిస్క్ కి రెడీ అంటేనే ఈ సినామికను ఛాయస్ గా పెట్టుకోవాలి

Also Read : Reality Shows On OTT : శాటిలైట్ నుంచి ఓటిటికి జంప్ చేసిన రియాలిటీ షోలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి