iDreamPost

Aadavallu Meeku Johaarlu : పోటీ పడుతున్న ఓటిటి ప్రీమియర్లు

Aadavallu Meeku Johaarlu : పోటీ పడుతున్న ఓటిటి ప్రీమియర్లు

ఇటీవలే విడుదలైన ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫైనల్ గా ఫ్లాప్ వైపే పరుగులు పెడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ అండతో గట్టెక్కాలనుకున్న శర్వానంద్ ఆశలపై దర్శకుడు తిరుమల కిషోర్ నీరసమైన కథనంతో నీళ్లు చల్లేశారు. రేపు ఈటి, ఎల్లుండి రాధే శ్యామ్ రానుండటంతో ఆడవాళ్ళూ సెలవు తీసుకునే టైం వచ్చేసింది. అందుకే ఈ నెల 21నే సోనీ లివ్ లో ఓటిటి ప్రీమియర్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ డేట్ లాక్ చేశారని వినికిడి. ఆ సమయానికి రన్ ఆశించడం అత్యాశే. పైగా 25న ఆర్ఆర్ఆర్ వస్తున్న నేపథ్యంలో సినీ ప్రేమికులు దేన్నీ పట్టించుకునే స్టేజి లో ఉండరు. అందుకే ఇదే మంచి నిర్ణయం.

నాలుగైదు మాములు జోకులతో స్క్రీన్ నిండా ఆడవాళ్లను చూపించి వాళ్ళతో క్లాసులు చెప్పిస్తే చాలు సినిమా హిట్ అయిపోతుందన్న అంచనా పూర్తిగా తప్పింది. 16 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకున్న ఈ మూవీ కనీసం పది మార్కు కూడా అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరగా ఓటిటికి వెళ్లడం ద్వారా నష్టాల రికవరీని పెంచుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే మూడు వారాల గ్యాప్ ని ఫిక్స్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీనికన్నా ముందు ఆది పినిశెట్టి నటించిన క్లాప్ ఎల్లుండి ఇదే ప్లాట్ ఫార్మ్ పై డైరెక్ట్ రిలీజ్ అందుకోనుంది. ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లకు గట్టి పోటీ ఇచ్చే ప్లాన్ లో ఉన్న సోనీ లివ్ మెల్లగా విడుదల కౌంట్ ని పెంచుతోంది.

భీమ్లా నాయక్ సైతం 25న వచ్చే అవకాశం ఉండటంతో ఆడవాళ్ళూ ముందుగా స్ట్రీమింగ్ కావడం మంచిదే. ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నట్టుగా ఓటిటి ప్రీమియర్లకు సైతం ముందు వెనుకా చెక్ చేసుకోవాల్సి వస్తోంది. లేదంటే ఆడియన్స్ ఆప్షన్స్ ఎక్కువైపోయి డివైడ్ అయిపోతున్నారు. ఇవి కూడా శుక్రవారమే వచ్చేలా ప్లానింగ్ చేసుకోవడంతో వీకెండ్ మొత్తం జనానికి ఎంటర్ టైన్మెంట్ మరీ ఎక్కువైపోయి ఏదీ చూడాలో ఏది మిస్ చేయాలో అర్థం కాని అయోమయ నెలకొంటోంది. విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ ఈ 12న ప్రైమ్ ద్వారా రాబోతున్నట్టు టాక్. పూనమ్ కౌర్ నటించిన నాతిచరామి 20న డైరెక్ట్ ఓటిటి ద్వారా వచ్చేస్తోంది

Also Read : ET : సూర్య సినిమాకు ఎన్ని చిక్కులో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి