iDreamPost

Sebastian Report :సెబాస్టియన్ రిపోర్ట్

Sebastian Report :సెబాస్టియన్ రిపోర్ట్

రాజావారు రాణిగారుతో డీసెంట్ డెబ్యూ అందుకుని గత ఏడాది ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సినిమా సెబాస్టియన్. దీని మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ ట్రైలర్ వచ్చాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉండటంతో ప్రమోషన్లు హైప్ పెంచడానికి తోడయ్యాయి. ఆడవాళ్లు మీకు జోహార్లుతో క్లాష్ కి సిద్ధ పడిన ఈ  క్రైమ్ థ్రిల్లర్ కు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా సిద్ధారెడ్డి ప్రమోద్ లు నిర్మించారు. భీమ్లా నాయక్ వచ్చిన రెండో వారానికే థియేటర్లలో అడుగు పెట్టిన ఈ సెబాస్టియన్ ఆశించిన విధంగా రిపోర్ట్ చేశాడా లేక కిరణ్ కు ఏమైనా షాక్ ఇచ్చాడా చూద్దాం.

బాల్యం నుంచే రేచీకటితో బాధ పడుతున్న సెబాస్టియన్(కిరణ్ అబ్బవరం)కు చనిపోయిన తండ్రి లక్ష్యాన్ని కానిస్టేబుల్ కావడం ద్వారా నెరవేరుస్తాడు. అయితే తల్లికిచ్చిన మాట ప్రకారం తన లోపాన్ని బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంటాడు. నైట్ డ్యూటీలు పడినప్పుడంతా ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. ఈ క్రమంలో సెబాస్టియన్ వల్ల ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. దీంతో యునిఫామ్ కు దూరమవుతాడు. ఎలాగైనా దీని వెనుక ఉన్న హంతకుడెవరో కనిపెట్టాలని కంకణం కట్టుకుంటాడు. మరి ఈ దారుణానికి సూత్రధారులు ఎవరు, చివరికి సెబాస్టియన్ జాబ్ తిరిగి వచ్చిందా లేదా అనేది తెరమీద చూసి తెలుసుకోవాలి.

కంటి జబ్బు ఉన్నవాడికి పోలీస్ జాబ్ ఎలా వస్తుందన్న లాజిక్ ని చాలా కన్వీనియంట్ గా పక్కన పెట్టేసిన దర్శకుడు మిగిలిన కంటెంట్ ని గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఆ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. ఎంటర్ టైన్మెంట్ ని కొంత వరకు నీట్ గానే డీల్ చేసిన బాలాజీ సయ్యపురెడ్డి అసలైన క్రైమ్ కాన్సెప్ట్ కి చేతులెత్తేయడంతో ల్యాగ్ విపరీతంగా పెరిగిపోయింది. లవ్ ట్రాక్ కానీ, ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు కానీ ఏదీ ఓ పద్ధతి ప్రకారం ఉండదు. కథనం మీద పెద్దగా కసరత్తు చేయకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లిపోయారు. కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ రెండూ బాగున్నాయి కానీ తనను పూర్తిగా వాడుకునే స్థాయిలో క్యారెక్టర్ లేదు. జిబ్రాన్ సంగీతం పర్వాలేదు. హీరోయిన్లు సినిమా అయ్యాక గుర్తుండరు. పాయింట్ ఓకే ప్రెజెంటేషన్ వీకే అనేలా సాగింది సెబాస్టియన్

Also Read :Hey Sinamika Report : హే సినామిక రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి