iDreamPost
android-app
ios-app

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్!

  • Published Feb 19, 2024 | 5:11 PM Updated Updated Feb 19, 2024 | 5:11 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు..

టీమిండియా స్టార్ క్రికెటర్ తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు..

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్!

టీమిండియా స్టార్ క్రికెటర్ తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. గతంలో కూడా ఓసారి ఈ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ వారం రోజులకే తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. అయితే ఈసారి మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే క్రికెట్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా స్టార్ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈడెన్ గార్డెన్ లో బిహార్ తో జరిగే మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని వెల్లడించాడు. కాగా.. గతేడాది ఆగస్టులో అన్ని ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఏమైందో తెలీదు.. వారం రోజులకే తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. తాజాగా మరోసారి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ఈసారి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశాడు మనోజ్ తివారీ. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా రంజీ కెరీర్, ఈడెన్ గార్డెన్స్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

“నేను చివరిసారిగా గ్రౌండ్ లోకి దిగే సమయం వచ్చింది. నాకు ఇష్టమైన 22 గజాల సుదీర్ఘమైన పిచ్ పై పరిగెత్తడం ఇదే లాస్ట్ టైమ్ అనుకుంటా. ఇన్నేళ్లుగా నాకు మద్ధతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈడెన్ గార్డెన్స్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీ ప్రేమను ఎప్పటికీ.. మర్చిపోలేను” అంటూ రాసుకొచ్చాడు మనోజ్ తివారీ. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 12 వన్డేలుల, మూడు టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్ లు ఆడాడు. కాగా.. తివారీ 141 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9వేలకు పైగా రన్స్ చేశాడు. ఇందులో30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి రెండోసారి మనోజ్ తివారీ రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Virat Kohli: వీడియో: విరాట్‌ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్షా భోగ్లే!