nagidream
తల్లిదండ్రులకు ఏమైనా అయితే వారిని కాపాడాల్సిన బాధ్యత కొడుకుల మీద ఉంటుంది. కాపాడలేని పరిస్థితుల్లో చేతులెత్తేసే కొడుకులు చాలా మంది ఉంటారు. అయితే ఆర్థికంగా బాగా ఉండి కూడా ఆ నటుడు తన తండ్రిని కాపాడుకోలేకపోయారు. పైగా చనిపోమని తండ్రికి చెప్పారు.
తల్లిదండ్రులకు ఏమైనా అయితే వారిని కాపాడాల్సిన బాధ్యత కొడుకుల మీద ఉంటుంది. కాపాడలేని పరిస్థితుల్లో చేతులెత్తేసే కొడుకులు చాలా మంది ఉంటారు. అయితే ఆర్థికంగా బాగా ఉండి కూడా ఆ నటుడు తన తండ్రిని కాపాడుకోలేకపోయారు. పైగా చనిపోమని తండ్రికి చెప్పారు.
nagidream
తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. అలాంటి తల్లిదండ్రులను బతికుండగానే చనిపోమని చెప్పే దుస్థితి ఏ కొడుకుకి రాదు. కానీ ఓ స్టార్ నటుడికి ఆ పరిస్థితి వచ్చింది. తన తండ్రిని బతికుండగానే ప్లీజ్ చనిపో నాన్న అని అనాల్సి వచ్చింది. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ గురించి పరిచయం అవసరం లేదు. విలక్షణ నటనతో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగులో ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం సినిమాలతో మెప్పించారు మనోజ్ బాజ్ పాయ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటనను వెల్లడించారు. నా తండ్రి మరణం నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన సంఘటన అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఒకరోజు తన సోదరి ఫోన్ చేసి నాన్న జీవితం ముగిసిందని చెప్పిందని.. కానీ డాక్టర్లు మాత్రం ఆయన ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడో ఇరుక్కుపోయారని అన్నారని గుర్తు చేశారు. తనకు, తన తండ్రికి మధ్య బాండింగ్ ఎక్కువగా ఉండడం చేత.. ఈ నరకం నుంచి ఆయనకు విముక్తి కల్పించాల్సింది నువ్వే అని తన సోదరి చెప్పిందని అన్నారు. ఆ సమయంలో తాను ‘కిల్లర్ సూప్’ వెబ్ సిరీస్ సెట్స్ లో ఉన్నానని అన్నారు. తన వ్యాన్ లో బాయ్ ముందే నాన్నతో మాట్లాడానని అన్నారు. నొప్పి భరించింది చాలు నాన్న.. ప్లీజ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో.. అందరినీ వదిలి వెళ్లే సమయం వచ్చింది అని చెప్పానని అన్నారు. అలా మాట్లాడినందుకు తాను ఎంతో కుమిలిపోయానని.. తనతో పాటు ఉన్న బాయ్ ఏడ్చేశాడని గుర్తు చేసుకున్నారు.
తాను ఇలా మాట్లాడిన తర్వాత రోజు తెల్లవారుజామున తన తండ్రి కన్ను మూశారని.. ఆరోజులు ఎంత కష్టంగా, నరకప్రాయంగా గడిచాయో తనకు మాత్రమే తెలుసని అన్నారు. తన గొంతు విన్నాక నాన్న మనసు కుదుటపడిందని.. ఆయన ప్రశాంతంగా కన్ను మూశారని అన్నారు. ఆయన మరణ వార్త విన్న నాకు కన్నీళ్లు ఆగలేదని అన్నారు. ఆ తర్వాత తన తల్లికి క్యాన్సర్ తిరగబెట్టిందని.. తన సోదరి వైద్యం కోసం సిటీకి తీసుకొచ్చిందని.. కానీ అమ్మకు పిల్లల మీద ఆధారపడటం ఏ మాత్రం ఇష్టం లేదని.. ఒకరి మీద ఆధారపడడం కంటే చనిపోవడమే మేలని ఆమె డాక్టర్స్ తో అందని మనోజ్ బాజ్ పాయ్ గుర్తు చేసుకున్నారు. నాన్న చనిపోయిన తర్వాత ఏడాది తన తల్లి చనిపోయిందని అన్నారు. మనోజ్ బాజ్ పాయ్ తండ్రి 2021అక్టోబర్ లో చనిపోగా.. 2022 డిసెంబర్ లో ఆయన తల్లి మరణించింది.