iDreamPost

21 ఏళ్ల తర్వాత.. మన్మధుడు హీరోయిన్ రీ ఎంట్రీ!

  • Published Feb 22, 2024 | 10:14 AMUpdated Feb 23, 2024 | 12:22 PM

Anshu: సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు రీ ఎంట్రీ అనేది ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల భామ దాదాపు 21 ఏళ్ల తర్వాత వెండితెర పై ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

Anshu: సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు రీ ఎంట్రీ అనేది ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల భామ దాదాపు 21 ఏళ్ల తర్వాత వెండితెర పై ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 22, 2024 | 10:14 AMUpdated Feb 23, 2024 | 12:22 PM
21 ఏళ్ల తర్వాత.. మన్మధుడు హీరోయిన్ రీ ఎంట్రీ!

ఈ మధ్యకాలంలోని సినీ ఇండస్ట్రీలో తారలు రీ ఎంట్రీ అనేది ట్రెండ్ గా మారింది. ఇటీవలే చాలామంది అలనాటి నటులు వెండితెర పై తమ సెంకడ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నారు. ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నవాళ్లు సైతం ఇప్పుడిప్పుడే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అటూ సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలను పోషిస్తూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మరో అందాల భామ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించానుంది. ఎంతో అందంగా అలరించే ఈ ముద్దుగుమ్మ త్వరలో వెండితెర పై సందడి చేయనుందనే వార్త వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నఈ బ్యూటీ పేరు ‘అన్షు’. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, నాగర్జున నటించిన ‘మన్మధుడు’ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. 2002లో నాగర్జున నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రేతో పాటు అన్షు కూడా నటించింది. ఈ సినిమాను విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ కథ మాటాలు అందించారు. ఇక టాలీవుడ్ లో మన్మధుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అన్షు.. మొదటి సినిమాతో వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే రాఘవేంద్ర, మిస్సమ్మ వంటి సినిమాల్లో నటించి అలరించింది. కానీ ఆ సినిమాలేవి అన్షుకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో అవకాశాల జోరు తగ్గడంతో అన్షు కూడా తెలుగు పరిశ్రమకు దూరం అయిపోయింది.

అయితే అన్షు చేసిన రెండు సినిమాల్లోను సగం పాత్రలు చనిపోయినవే చేసింది. ఈ కారణం చేతనే ఏమో తెలియదు కానీ అమ్మాడు అంతగా ఆఫర్లను అందిపుచ్చుకోలేదు. దీంతో ఆమె లండన్ కు వెళ్లిపోయింది. ఇక ఆె పుట్టి పెరిగింది కూడా అక్కడే కావడంతో.. అక్కడే చదువు పూర్తి చేసుకోని బిజినేషన్ మేన్ సచిన్ సగ్గార్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా అన్షు దాదాపు 21 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇన్ స్ట్రా గ్రామ్ లోని.. నిఖల్ విజయేంద్ర సింహ అనే వ్యక్తి ఈ బ్యూటీ వీడియోను షేర్ చేస్తూ అందులో.. ’20 సంవత్సరాల తర్వాత మన్మధుడు హీరోయిన్ మహేశ్వరి ( అన్షు) గ్రాండ్ రిటర్న్ కోసం ఎదురుస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి మమీకు అందరి ప్రేమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను’ అని క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ వీడియో క్షణల్లో వైరల్ అయిపోయింది. ఇందులో అన్షు చూసిన నెటిజన్స్ ఎంతలా మారిపోయిందటూ కామెంట్ లు పెడుతున్నారు. మరి, మన్మధుడు సినిమా హీరోయిన్ అన్షు రిసెంట్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి