iDreamPost

మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. పేద విద్యార్థల కోసం!

  • Published Jun 29, 2023 | 11:33 AMUpdated Jun 29, 2023 | 11:33 AM
  • Published Jun 29, 2023 | 11:33 AMUpdated Jun 29, 2023 | 11:33 AM
మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. పేద విద్యార్థల కోసం!

మంచు లక్ష్మి.. మోహన్‌బాబు కుమార్తెగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా సరే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర మీద పలు షోలు చేసి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ.. మంచి నటి అనిపించుకుంది. ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే.. సోషల్‌ మీడియాలో ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా ఆమె భాష మీద విపరీతమైన విమర్శలు వస్తుంటాయి. కానీ ఇవేం పట్టించుకోకుండా.. తనకు నచ్చిన మార్గంలోనే పయనిస్తారు. మంచు లక్ష్మి మీద ఎప్పుడు విమర్శలు చేసే నెటిజనులు.. తాజాగా ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. మంచు లక్ష్మి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని.. వాటిని అభివృద్ధి చేస్తూ.. అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని కోసం మంచు లక్ష్మి.. టీచ్‌ ఫర్‌ చేంజ్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి ఏటా కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని.. వాటిని అభివృద్ధి చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. తాను స్థాపించిన స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఈ బడులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే టీచ్ ఫర్ చేంజ్ లక్ష్యమని ఈ సందర్భంగా మంచు లక్ష్మి వెల్లడించారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మి.. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో భేటీ అయ్యారు. అనంతరం స్కూళ్ల దత్తతకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు.

అనంతరం మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. గద్వాల జిల్లాలో తాము దత్తత తీసుకున్న 30 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ క్లాసులు, మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఆగస్టు లోపల పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అన్నారు. తాము మాటలు చెప్పే రకం కాదని.. చేసి చూపిస్తామని అంటూ తాము గతేడాది యాదాద్రి జిల్లాలో అభివృద్ధి చేసిన 56 పాఠశాలల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు మంచు లక్ష్మిr.

ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థులకు తమ టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా మంచి విద్య అందాలన్నదే తమ లక్ష్యం అన్నారు మంచు లక్ష్మి. అందుకే ప్రతి సంవత్సరం వేర్వేరు జిల్లాలకు వెళ్లి సరైన మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా గత ఏడాది యాదాద్రి జిల్లాలో 50 స్కూళ్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేశామని తెలిపారు. అంతేకాక జనాలు ఎవరైనా సరే.. తమ ఊర్లలో అభివృద్ధి చేయాల్సిన పాఠశాలలు ఉంటే తనకు తెలియజేయమన్నారు మంచు లక్ష్మి. వాటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి