iDreamPost

రూ.22వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. పార్సిల్ లో వచ్చింది చూసి కస్టమర్ బిత్తరపోయాడు!

ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ తనకు ఇష్టమైన ఫోన్ ఆర్డర్‌పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు.

ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ తనకు ఇష్టమైన ఫోన్ ఆర్డర్‌పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు.

రూ.22వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. పార్సిల్ లో వచ్చింది చూసి కస్టమర్ బిత్తరపోయాడు!

ప్రస్తుతం కాలంలో ఈ-కామర్స్ వ్యాపారం బాగా పెరిగింది. చాలా మంది ఆన్ లైన్ షాపింగ్స్ ఎక్కువ చేస్తున్నారు. దీంతో  కంపెనీలు దాదాపు అన్ని రకాల ప్రొడక్టలను ఆన్ లైన్ లో డెలివర్ చేస్తున్నాయి. ప్రముఖ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల నెట్‌వర్క్‌ మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. ఇది ఇలా ఉంటే.. ఈ ఆన్ లైన్ ఆర్డర్ల విషయంలో కొన్ని సార్లు చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి వస్తుంది. అలానే తాజాగా ఓ కస్టమర్ కి  చేదు అనుభవం అయింది. ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేస్తే.. రాళ్లు వచ్చాయి.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక వ్యక్తి మార్చి 28న ఫ్లిప్ కార్డ్ ద్వారా ఓ స్మార్డ్ ఫోన్ ఆర్డర్ పెట్టాడు. రూ.22  వేల ఖరీదైన ఆ ఫోన్  సదరు వ్యక్తి ఆర్డర్ చేశాడు. సదరు వ్యక్తి ఆర్డర్ కూడా అదే రోజు ప్యాకేజీ డెలివర్ అయింది. ఇక కొత్త ఫోన్ వస్తుందనే సంతోషంలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఇక పార్శిల్ రాగానే ఎంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబు అయ్యారు. అలా తన చేతికి వచ్చిన పార్శిల్ ను ఓపెన్‌ చేసిన కస్టమర్ షాకయ్యాడు.

ప్యాకేజీలో స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రాళ్లు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో చక్కగా ప్యాక్ చేసి.. అందులో పెట్టారు. ఇక స్మార్ట్ ఫోన్ బదులు రాళ్లు రావడంతో చాలా సమయం పాటు బాధితుడు షాక్ లోనే ఉండిపోయాడు. కాసేపటికి తేరుకుని అతను ప్యాకేజీని రిటర్న్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే కంపెనీ రిటర్న్‌ లేదా ఎక్స్ఛేంజ్‌ చేయడానికి అంగీకరించలేదని సమాచారం.

ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏమి తెలియదు. ఆ వ్యక్తి పేరు ఉండే ప్రాంతానికి సంబంధించిన వివరాలు తెలియదు. అయితేఈ ఘటనకు సంబంధించి మైక్రో బ్లాంగ్ ఫ్లాట్ ఫామ్ అయినా ఎక్స్ వేదికలో ఓ వ్యక్తి ఓ ఇమేజ్ ను పోస్ట్ చేశారు. దీనికి ఓ క్యాపన్ష్ కూడా రాసుకొచ్చారు. ‘ఘజియాబాద్ నివాసి ఒకరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.22 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను ఆర్డర్ చేశానని, బదులుగా రాళ్లు వచ్చాయని అందులో పేర్కొన్నాడు. పార్శిల్‌ను రిటర్న్ తీసుకోవడానికి సదరు కంపెనీ నిరాకరించిందని బాధితుడు పేర్కొన్నాడు’ అని అందులో యాడ్‌ చేశారు.

ఆ వ్యక్తి గోల్డెన్ అవర్ ప్రమోషన్ సమయంలో ఇన్ఫినిక్స్ జీరో 30జీబీ స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్ చేశాడు. 256 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్‌ను ఎంపిక చేసుకున్నాడు. దీనిపై ఫ్లిప్ కార్ట్ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆర్డర్ చేసింది తప్ప మరేమీ డెలివరీ చేయాలని మేము కోరుకోమని తెలిపింది. అలానే మీకు మరింత సహాయం చేయడానికి ఆర్డర్ వివరాలను ప్రైవేట్ చాట్ ద్వారా తమకు తెలియజేయండి అంటూ చెప్పుకొచ్చింది. అలానే ఫ్లిప్‌కార్ట్‌లా నటిస్తూ ఫేక్‌ అకౌంట్లు హ్యాండిల్‌ చేస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని, స్పందించవద్దని తెలిపిందని సదరు సంస్థ చూచింది.

అలా ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న సదరు వ్యక్తికి రాళ్లు రావడంతో ఊహించని షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ భారీ డిస్కౌంట్‌ అని ఆశపడి ఆర్డర్‌పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు. మరి.. ఇలాంటి ఘటనల నివారణ జరగాలంటే  ఏం చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి