iDreamPost

కం*డోమ్స్ ఆర్డర్ చేశాడు.. అడ్రస్ మార్చడం మాత్రం మర్చిపోయాడు!

కం*డోమ్స్ ఆర్డర్ చేశాడు.. అడ్రస్ మార్చడం మాత్రం మర్చిపోయాడు!

ఇప్పుడు అందరూ ప్రతి వస్తువుని ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ప్రతి చిన్న వస్తువు కోసం కూడా ఇ-కామర్స్ సైట్స్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. వీటికి ఎంతలా అలవాటు పడిపోయారు అంటే.. చిన్న గుండు సూది కూడా వీధిలో ఉన్న షాప్ కి వెళ్లి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పైగా ఇన్ స్టెంట్ డెలివరీ అని కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. ఇందులో ఏ వస్తువులు ఆర్డర్ చేయాలి అంటే.. మీర ఏం ఆర్డర్ చేసినా తెచ్చి ఇస్తారు. అలా ఓ యువకుడు కం*డోమ్స్ ఆర్డర్ చేశాడు. కాకపోతే ఒక చిన్న పొరపాటు చేశాడు. ఇంకేముంది కథ మొత్తం అడ్డం తిరిగింది.

స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. అందుకే చాలా మంది వస్తువులను అందులోనే బుక్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మీరు ఏ అవసరానికి ఆర్డర్ చేసినా వాళ్లి నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు. అలా ఓ కుర్రాడు అందులో కం*డోమ్స్ ఆర్డర్ చేశాడు. కానీ, యాప్ లో డెలివరీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడు. ఇంకేముంది.. అవి కాస్తా వాళ్ల ఇంటికి డెలివరీ అయ్యాయి. వాటికి ఆ కుర్రాడి తల్లి రిసీవ్ చేసుకుంది. ఇంట్లోకి వెళ్లి ఓపెన్ చేసి చూడగా.. అందులో కం*డోమ్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని వాళ్ల చెల్లి పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

ఆ పోస్టు చూసి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరు మాత్రం ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి అంటూ కామెంట్ చేశాడు. అందుకు ఆమె ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అందులో వాళ్ల అన్నను ఫ్యామిలీ గ్రూప్ నుంచి రిమూవ్ చేసింది. సోదరి మళ్లీ యాడ్ చేయగా.. తల్లి మళ్లీ అతడిని రిమూవ్ చేస్తుంది. ఇలా ఉంది పరిస్థితి అంటూ కామెంట్ చేసింది. ఈ మొత్తం తతంగం చూసిన తర్వాత.. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో అన్నీ డెలివరీ చేస్తారు. అలా అని అన్నీ ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తే ఇలాగే అవుతుంది. నాలుగు అడుగులు వేసి మెడికల్ షాపులో కొనుక్కుంటే.. ఇంత కష్టం వచ్చేది కాదుగా బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి