iDreamPost
android-app
ios-app

పాపం పగోడికి కూడా ఇలాంటి కష్టం వద్దు.. పెళ్లాడేందుకు పిల్ల దొరకలేదని.. గేదెతో

  • Published Jun 05, 2024 | 10:13 AM Updated Updated Jun 05, 2024 | 10:13 AM

పెళ్లి కోసం యువత ఎన్ని పాట్లు పడుతున్నారో తెలియజెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు పడి పడి నవ్వుతున్నారు.

పెళ్లి కోసం యువత ఎన్ని పాట్లు పడుతున్నారో తెలియజెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు పడి పడి నవ్వుతున్నారు.

  • Published Jun 05, 2024 | 10:13 AMUpdated Jun 05, 2024 | 10:13 AM
పాపం పగోడికి కూడా ఇలాంటి కష్టం వద్దు.. పెళ్లాడేందుకు పిల్ల దొరకలేదని.. గేదెతో

నేటి కాలంలో యువతను బాగా వేధిస్తున్న సమస్య పెళ్లి. జీవితంలో సెటిల్‌ అయ్యాకే వివాహం చేసుకోవాలని భావిస్తుండటంతో.. 30 ఏళ్లు పైబడ్డ తర్వాతే పెళ్లి ఆలోచన చేస్తున్నారు. దాంతో చాలా మంది యువకులకు పెళ్లి కుమార్తె దొరకడం పెద్ద సమస్యగా మారింది. అసలు పిల్ల దొరకడమే లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్రహ్మచారుల సంఘాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల ముందు కొందరు బ్రహ్మచారి యువకులు.. తమకు పెళ్లి చేయాలని.. పిల్లను చూడాలని.. తమకు కూడా ప్రతి నెల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది. అంతేకాక ఇది ప్రాంకో, నిజమో తెలియదు కానీ.. స్రస్తుతం సమాజంలో ఇదే పరిస్థితి ఉంది అంటున్నారు ఈ వీడియో చూసిన వారు.

పెళ్లి కావడం లేదనే కోపమో.. లేక బాధనో తెలియదు కానీ ఓ యువకుడు.. ఏకంగా గేదెను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇది నిజమో.. ప్రాంకో తెలియడం లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. దీనిలో ఓ యువకుడు గేదెను వివాహం చేసుకున్నాడు. ట్విట్టర్‌లో మోనిసింగ్‌9090 ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇక ఈ వీడియోలో ఒక యువకుడు గేదెను వివాహం చేసుకోవడం చూడవచ్చు.  వీడియోలో ముందుగా గేదెకు పూల మాల వేసి ఆ తర్వాత తన మెడలో కూడా పువ్వుల మాలను వేసుకున్నాడు సదరు యువకుడు. ఆ తర్వాత గేదె నుదిటిపై సింధురాన్ని పెట్టాడు. గేదెకు చున్నీ కప్పాడు. తర్వాత ఒక స్త్రీ.. గేదెకు, ఆ యువకుడికి దిష్టి తీసింది. అనంతరం ఆ యువకుడు గేదెను ఎక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కొంచెం దూరం ఆ యువకుడిని తీసుకుని వెళ్ళిన గేదె.. అతడిని కింద పడేసి పారిపోతుంది. గేదె మీద కూర్చున్న యువకుడు కిందపడిపోవడంతో కాలికి గాయమైంది.

జూన్‌ 1న షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు దీన్ని లక్షల మంది చూశారు. ఇక ఈ వీడియోని చూసిన జనాలు.. ఇది రియల్‌ సీన్‌ అబ్బా.. నిజంగానే ఇది పరిస్థితి ఉంది.. మాకు కూడా పిల్ల దొరకడం లేదు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet