iDreamPost

మేడ్చల్‌లో మల్లారెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వడివడిగా వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి, బీఆర్ఎస్ మేడల్చ్ అభ్యర్థి మల్లారెడ్డి విజయం సాధించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వడివడిగా వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి, బీఆర్ఎస్ మేడల్చ్ అభ్యర్థి మల్లారెడ్డి విజయం సాధించారు.

మేడ్చల్‌లో మల్లారెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ పై విజయ కేతనం ఎగుర వేశారు. సమీప అభ్యర్థి వజ్రేష్ యాదవ్ పై సుమారు 9 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మిక మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తున్నారు మల్లా రెడ్డి. మల్లా రెడ్డి రాజకీయ నేతే కాదూ విద్యా వేత్త, వ్యాపార వేత్త. మంచి వక్త కూడా.  తెలంగాణలో నెలకొన్న మల్లారెడ్డి యూనివర్శిటీ, కాలేజీలు ఆయనవే. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కూడా ఆయనే.

మల్లారెడ్డి అనగా ముందుగా గుర్తుకువచ్చేది ‘పాలమ్మినా, పూలమ్మినా’ డైలాగే. తన మాటలతో ఫేమస్ అయిపోయారు. ఆయన ప్రసంగిస్తే.. ఆద్యంతం ఇలాంటి డైలాగులే వినిపిస్తుంటాయి.   2014లో తెలుగుదేశంలో చేరిన ఆయన.. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దక్కిన ఏకైక పార్లమెంట్ సీటు అదే. 2016లో బీఆర్ఎస్ లోకి చేరారు మల్లారెడ్డి.  ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో.. పార్టీలోని కీలక నేతలు ఓడిపోతున్న సందర్భంలో మల్లారెడ్డి గెలవడం ఆ శ్రేణులకు ఊరట కలిగించే అంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి