iDreamPost
android-app
ios-app

Keechurallu OTT: OTTలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.. తెలుగులో కూడా!

  • Published May 29, 2024 | 11:54 AMUpdated May 29, 2024 | 11:54 AM

మలయాళ సినిమాలు ప్రేక్షకులను బాగానే మెస్మరైజ్ చేస్తున్నాయి. నిన్న మొన్నటివరకు మలయాళీ సినిమాలు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మరొక సినిమా ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

మలయాళ సినిమాలు ప్రేక్షకులను బాగానే మెస్మరైజ్ చేస్తున్నాయి. నిన్న మొన్నటివరకు మలయాళీ సినిమాలు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మరొక సినిమా ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 29, 2024 | 11:54 AMUpdated May 29, 2024 | 11:54 AM
Keechurallu OTT: OTTలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.. తెలుగులో కూడా!

థియేటర్ లో కొత్త సినిమాలు లేక ఇటు ఓటీటీ లో తెలుగు సినిమాలు తక్కువగా ఉండడంతో.. ఈ వీకెండ్ లైట్ తీసుకుందాంలే అనుకునే టైమ్ కి కొన్ని సినిమాలు సడన్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చెందినదే. పైగా మలయాళీ సినిమా.. ఈ మధ్య కాలంలో మలయాళీ సినిమాలు ప్రేక్షకులను ఏ రకంగా మెస్మరైజ్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు అటు థియేటర్ లోను, ఇటు ఓటీటీ లోను తెలుగులోకి డబ్ చేసిన మలయాళీ సినిమాలదే హావ. ఈ క్రమంలో తాజాగా మరొక మలయాళీ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి.. డైరెక్ట్ ఓటీటీ లోకి రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మలయాళీ సినిమా పేరు “కీడం” .. తెలుగులో ఈ సినిమాను “కీచురాళ్ళు” అనే పేరుతో డబ్బింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్ లో రిలీజ్ చేసిన ఈ మలయాళీ థ్రిల్లర్… డీసెంట్ కలెక్షన్స్ తోనే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ ఉండడంతో ప్రేక్షకులను బాగానే మెప్పించింది ఈ మూవీ. కీచురాళ్ళు మూవీకి రాహుల్ రిజీ నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఈ సినిమాలో ర‌జిషా విజ‌య‌న్‌తో పాటు శ్రీనివాస‌న్‌, విజ‌య్ బాబు ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మే 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక కీచురాళ్లు సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో ర‌జిషా విజ‌య‌న్‌ ఓ సైబర్ సెక్యూరిటీ స్టార్ట‌ప్ కంపెనీని రన్ చేస్తూ ఉంటుంది, సైబర్ క్రైమ్స్ ను సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయపడుతూ ఉంటుంది, ఈ క్రమంలో ఆమె అనుకోకుండా సైబర్ క్రైమ్ భాదితురాలుగా మారుతుంది. ఆమెకు ఓ వ్యక్తి వాల్స్ చేసి బెదిరిస్తూ ఉంటాడు . అతను ఎవరు ? ఆమె ఎందుకు సైబర్ క్రైమ్ భాదితురాలిగా మారుతుంది ? కనిపించకుండా కాల్స్ చేస్తున్న ఆ వ్యక్తిని ఆమె ఎలా పట్టుకుంది ? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి