iDreamPost

ఆలేరు వద్ద కృష్ణ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!

Krishna Express: దేశంలో చాలా వరకు సుదూర ప్రయాణాలు చేసేవారు ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడుతుంటారు. బస్సు కన్నా ట్రైన్ లో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి.

Krishna Express: దేశంలో చాలా వరకు సుదూర ప్రయాణాలు చేసేవారు ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడుతుంటారు. బస్సు కన్నా ట్రైన్ లో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి.

ఆలేరు వద్ద కృష్ణ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!

భారత దేశంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే సౌకర్యం ట్రైన్ లో మాత్రమే ఉంటుంది.  సూదరు ప్రయాణాలు చేసేవారికి రైల్ లో చాలా సదుపాయాలు ఉంటాయి. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఇతర పనులపై వెళ్లే వారు  ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో రైల్లో  ప్రయాణం చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆలేరు వద్ద కృష్ణ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. సికింద్రబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ లో పొగలు వ్యాపించిన ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం తప్పింది. కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు విరిగిపోయిన ఘటన సంచలనంగా మారింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో పెద్ద శబ్ధం వినిపించింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన రైలు ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు.

Krishna Express missed an accident

అప్రమత్తమైన అధికారులు రైలు ని నిలిపివేశారు. అనంతరం అక్కడికి వెళ్లి పరిశీలించగా రైలు పట్టాలు విరిగినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేసిన అనంతరం రైలు బయలుదేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరైన సమయానికి పట్టాలు విరిగిన విషయం గురించి మరమ్మత్తు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదిలా ఉంటే శనివారం సికింద్రాబాద్- తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ లో పొగలు అలుముకున్న విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలును ఆపి సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి