iDreamPost
android-app
ios-app

మహిళలకి పోస్టాఫీసు బెస్ట్‌ స్కీమ్‌.. తక్కువ టైమ్ లోనే భారీ లాభాలు!

  • Published May 14, 2024 | 3:42 PMUpdated May 14, 2024 | 3:42 PM

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పోస్టాఫీసు కింద అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మహిళలను అర్థికంగా ధనవంతులు చేసేందుకు సేవింగ్స్‌ పేరిట  మరొ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పోస్టాఫీసు కింద అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మహిళలను అర్థికంగా ధనవంతులు చేసేందుకు సేవింగ్స్‌ పేరిట  మరొ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

  • Published May 14, 2024 | 3:42 PMUpdated May 14, 2024 | 3:42 PM
మహిళలకి పోస్టాఫీసు బెస్ట్‌ స్కీమ్‌.. తక్కువ టైమ్ లోనే భారీ లాభాలు!

ప్రతి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి విషయంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తుంటారనే విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఏ ఇంట్లో అయిన కష్టపడి సంపాదిస్తున్న దాంట్లో కొంత మొత్తన్ని భవిష్యత్తు కోసం, పిల్లల కోసం పొదుపు చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక పొదుపు మాటకొస్తే.. ఆ విషయంలో మహిళలకు సాటి ఎవరు రారు అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది మహిళలు  కష్టపడిన కొంత సొమ్మును సేవింగ్స్ చేసుకొనేందుకు  ప్రభుత్వం రకరకాల స్కీమ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం పోస్టాఫీసు కింద మరొ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పోస్టాఫీసు కింద అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మహిళలను అర్థికంగా ధనవంతులు చేసేందుకు సేవింగ్స్‌ పేరిట  మరొ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా, బాలికలలో పెట్టుబడిని ప్రోత్సహించడానికి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ప్రారంభించింది. ఇక ఈ పథకం లో 2025 సంవత్సరం వరకు పెట్టుబడి పెట్టవచ్చు.  అలాగే దేశంలో ఏ మహిళ అయినా.. వయసుతో సంబంధం లేకుండా ఈ పథకం కింత ఖాతా తెరవడానికి, పెట్టుబడి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఇది పురుష సంరక్షకుడితో సహా చట్టబద్ధమైన, సహజమైన తల్లిదండ్రులు మైనర్ బాలిక కోసం ఖాతాను తెరవగలరు. కాగా, ఇది మీ కుమార్తె కానీ,  మీ ఆధ్వర్యంలోనైనా..  ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని అందిస్తుంది. అ

అయితే ఈ పథకం కింద మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌పై పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం 80C కింద మినహాయింపు ఉంది. అలాగే దానిపై వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ వలె కాకుండా మీరు దాని వడ్డీపై పన్ను ప్రయోజనాలను పొందలేరు. పైగా వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ తీసివేయబడుతుంది. ఇక ఈ పథకం సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే ఇది ప్రతి త్రైమాసికంలో ఖాతాలోకి వస్తుంది. కానీ వడ్డీ, మొత్తం అసలు మెచ్యూరిటీపై అందుబాటులో ఉంటుంది.ఒకవేళ మీరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో.. 2 సంవత్సరాల పాటు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీపై రూ.2.32 లక్షలు పొందుతారు.

కాగా, అది ఎఫ్‌డీ లాగానే పనిచేస్తుంది. ఇక మీరు మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఖాతాను తెరవడానికి ఫారమ్‌ను సమర్పించండి. వాటితో పాటు కేవైసీ పత్రాలు అంటే ఆధార్, పాన్ కార్డ్‌లను కూడా అందించాల్సి ఉంటుంది. ఇక మీరు చెక్‌తో పాటు పే-ఇన్-స్లిప్ కూడా ఇవ్వాలి.  ఇక దేశంలోని అనేక బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అంటే ఖాతాదారుడు మరణించిన తర్వాత దాన్ని మూసివేయవచ్చు. అయితే ఈ సందర్భంలో మీరు పత్రాలను అందించాలి. అలాగే కారణం లేకుండా ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత మూసివేస్తే అప్పుడు మీకు వడ్డీ 2 శాతం అంటే 5.5 శాతం మాత్రమే తగ్గుతుంది.

ఇక MSSCలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1000 నుంచి 100 గుణిజాల్లో ఉంటుంది. అయితే దీని గరిష్ట పరిమితి ఒక్కో ఖాతాకు రూ. 2 లక్షలు. ఒకవేళ మీకు ఇప్పటికే ఖాతా ఉండి, మరో మరో ఖాతాను తెరవాలనుకుంటే.. అందులో కనీసం 3 నెలల గ్యాప్‌ ఉండాలి. ఖాతా తెరిచిన 1 సంవత్సరం తర్వాత 40 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి, మహిళల సేవింగ్‌ కోసం పోస్టాఫీసు కింద తెచ్చిన ఈ కొత్త పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి