iDreamPost

యానిమల్ ప్రమోషన్స్‪లో మహేశ్ క్రేజ్. ఇది బాలీవుడ్‌కి స్వీట్ వార్నింగ్!

డిసెంబర్ 1 విడుదల కాబోతున్న యానిమల్ ప్రీ రిలీ జ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్శిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ప్రధాన కారణం.. మోస్ట్ హ్యాండ్సమ్, టాలీవుడ్ రాకుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు రావడమే..

డిసెంబర్ 1 విడుదల కాబోతున్న యానిమల్ ప్రీ రిలీ జ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్శిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ప్రధాన కారణం.. మోస్ట్ హ్యాండ్సమ్, టాలీవుడ్ రాకుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు రావడమే..

యానిమల్ ప్రమోషన్స్‪లో మహేశ్ క్రేజ్. ఇది బాలీవుడ్‌కి స్వీట్ వార్నింగ్!

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్శిటిలో అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రంలో నటించిన రణ బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, ఇతర బీటౌన్ టెక్నీషియన్లు సందడి చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, దిల్ రాజు తదితరులు ఈ ఈవెంట్‌కు అతిధులుగా హాజరయ్యారు. తమ స్పీచులతో ఉర్రూతలూగించారు. అభిమానులు, విద్యార్థులు ఈ వేడుకను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. అంత మంది జనాభాను చూసి షాక్ తిన్నారు బాలీవుడ్ స్టార్స్. ఈ వేడుకకు ఇంత ఆదరణ లభించడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి కారణం ఈ మూవీ ట్రైలర్ అయితే.. అసలు కారణం మహేష్ బాబు రావడం.

మహేష్ బాబు.. టాలీవుడ్ పరిశ్రమలో టాప్ స్టారే కాదూ.. కంప్లీట్ ఫ్యామిలీ మాన్. షూటింగ్, ఇళ్లు, పిల్లలే అతనికి తెలిసిన ప్రపంచం. అరుదుగా ఇలాంటి షోలకు వస్తూ ఉంటారు. తన ఆడియో ఫంక్షన్లకు తప్ప.. మిగిలిన మూవీలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రావడం చాలా అరుదు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సమయంలో యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పిలుపు మేరకు.. ప్రీ రిలిజ్ ఈవెంట్‌కు వచ్చారు. మహేష్ బాబు ఈ వేడుకకు వస్తున్నారని తెలిసి.. అభిమానులు పెద్ద యెత్తున కదలి వచ్చారు. దీంతో ప్రాంగణమంతా జన సందోహంతో నిండిపోయింది. అలాగే మహేష్ వస్తుంటే అరుపులు కేకలతో రచ్చ రచ్చ చేశారు విద్యార్థులు. మంత్రి మల్లారెడ్డి సైతం తాను రాజకీయాల్లోకి రావడానికి మహేష్ మూవీ కారణం అంటూ చెప్పుకొచ్చారు. అతడి క్రేజ్ చూసి అక్కడి ఉన్న బాలీవుడ్ స్టార్స్ బిత్తరపోయారని చెప్పొచ్చు.

అటు రణ బీర్ సైతం.. జై బాబు అంటూ మహేష్‌ను పొగుడుతూ హంగామా చేశారు. ఇక మహేష్ స్టేజీ ఎక్కినప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన మాట్లాడుతుండగా కూడా.. మాట్లాడనివ్వకుండా రచ్చ రచ్చ చేశారు స్టూడెంట్స్. ఇంత మందిని జనాలను చూసి కడుపు నిండినట్లు అయ్యింది యానిమల్ చిత్ర యూనిట్‌కు. అయితే అదంతా ఈ మిల్కీ బాయ్ మ్యాజిక్ అని వారికి కూడా తెలుసు. అయితే ఈ వేడుక బాలీవుడ్‌కు చిన్న స్వీట్ వార్నింగ్ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన ఈ స్టార్..తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీతో పాన్ ఇండియన్ హీరో అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అతడు వస్తే బీ టౌన్ రికార్డులు కూడా కొల్లగొట్టడం ఖాయం.  బాలీవుడ్ కలెక్షన్లలే కాదూ రికార్డులు ఒంటి చేత్తో ఎత్తికెళ్లిపోయే సత్తా ఉన్న స్టార్ హీరో రాబోతున్నాడని ఈ ఈవెంట్ చెప్పకనే చెప్పింది. ఇక ఈ మూవీపై ఎటువంటి అప్ డేట్ ఇవ్వకపోయినా.. తర్వలో షూటింగ్ స్టార్ చేసే అవకాశాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి