iDreamPost

మహేష్ 28 చుట్టూ ఎన్నో సవాళ్లు

మహేష్ 28 చుట్టూ ఎన్నో సవాళ్లు

విపరీతమైన అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మహేష్ 28 రేపటి నుంచి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రెండు వారాల పాటు చిత్రీకరించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ నోట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు తెరకెక్కేది ముందు అనుకున్న స్క్రిప్ట్ కాదు. పలు మార్పులు చేర్పులు చేశారు. మహేష్ ఇందులో రగ్డ్ లుక్ తో పాటు పొడవాటి జుత్తు గుబురు గెడ్డంతో కనిపించబోతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే కాగా రెండో కథానాయికగా శ్రీలీల నటించనుంది. ఈ విషయాన్ని తాజా ప్రెస్ రిలీజ్ లో ప్రస్తావించలేదు కానీ నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు కాబట్టి దాని గురించిన డౌట్ అక్కర్లేదు.

సర్కారు వారి పాట కమర్షియల్ గా బాగానే పే చేసినా రిజల్ట్ విషయంలో అభిమానులు ఏమంత సంతృప్తి లేరని గుర్తించిన మహేష్ ఎంత త్రివిక్రమైనా సరే సబ్జెక్టు విషయంలో రాజీ పడటం లేదు. అందుకే ఎన్నో డిస్కషన్ల అనంతరం చాలా సమయం ఖర్చవుతున్నా వెనుకాడలేదు. మధ్యలో తల్లి మరణం లాంటి పరిణామాలు జరగడం వల్ల అనుకున్న టైం కంటే బాగా లేట్ చేయాల్సి వచ్చింది. తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 11 విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి చేతిలో ఉన్న ఆరు నెలల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ తో సహా మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై మొత్తం ప్రమోషన్లకు కేటాయించాలి కాబట్టి ఈ వేగం అవసరం

దీని తర్వాత వెంటనే రాజమౌళి సినిమా ఉంటుందా లేక మరో మూవీ మహేష్ చేస్తాడా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఎంతలేదన్నా దాని కోసం రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి మార్చిలో జక్కన్న ఆస్కార్ వేడుక పూర్తి చేసుకుని వచ్చాక నిర్ణయం తీసుకోబోతున్నారు. కథ ఓకే అయ్యింది కానీ ఫైనల్ స్క్రిప్ట్ చెక్కడం అంత సులభంగా జరగదు. త్రివిక్రమ్ సైతం అల వైకుంఠపురములో తర్వాత చాలా గ్యాప్ వచ్చేయడంతో ఎలాగైనా సరే దాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు. అసలే మహేష్ తో చేసిన అతడు బుల్లితెర హిట్ అనిపించుకోగా ఖలేజా థియేటర్లలో ఆడలేదు. సో దీని విజయం చాలా కీలకం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి