iDreamPost

Guntur Karam: ‘గుంటూరు కారం’ స్టోరీ లీక్.. మరోసారి పొలిటీషియన్​గా మహేశ్?

  • Published Jan 03, 2024 | 8:22 PMUpdated Jan 04, 2024 | 5:35 PM

సూపర్​స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ స్టోరీకి సంబంధించిన లీక్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సూపర్​స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ స్టోరీకి సంబంధించిన లీక్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

  • Published Jan 03, 2024 | 8:22 PMUpdated Jan 04, 2024 | 5:35 PM
Guntur Karam: ‘గుంటూరు కారం’ స్టోరీ లీక్.. మరోసారి పొలిటీషియన్​గా మహేశ్?

కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపేందుకు మూవీస్ రెడీ అవుతున్నాయి. సంక్రాంతి బరిలోకి దిగేందుకు కోడిపుంజులతో పాటు సినిమాలూ సిద్ధమవుతున్నాయి. వసూళ్లలో తమ తడాఖా చూపేందుకు, పండుగ సీజన్​ను క్యాష్ చేసుకునేందుకు ఈసారి బడా స్టార్స్ అందరూ కలసి దండయాత్ర చేస్తున్నారు. అయితే అన్నింట్లోకి ఎక్కువ బజ్ మాత్రం సూపర్​స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ మీదే ఉంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ వేరే లెవల్లో ఉన్నాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన చిత్రం కావడం, మాస్ ఎంటర్​టైనర్​లా కనిపిస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో మహేష్ కొత్త మూవీ కథకు సంబంధించి పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇది పక్కా పొలిటికల్ మూవీ అని గాసిప్స్ వస్తున్నాయి.

‘గుంటూరు కారం’ స్టోరీకి సంబంధించి తాజాగా ఒక లీక్ బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ ఫిల్మ్​లో పొలిటికల్ హీట్ ఉండబోతోందట. ఈ సినిమాను త్రివిక్రమ్ రాజకీయ నేపథ్యంలోనే తెరకెక్కించారని టాక్. అయితే మూవీకి సంబంధించి ఇప్పటిదాకా బయటకు వచ్చిన సాంగ్స్, టీజర్​లో ఎక్కడా పొలిటికల్ టచ్ గురించి బయటకు రాకుండా జాగ్రత్త పడిన మేకర్స్.. నెక్స్ట్ రిలీజ్ అయ్యే ట్రైలర్​లోనూ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా మహేష్​కు సంబంధించిన మాస్ ఎలిమెంట్స్​నే హైలైట్ చేస్తారట. ‘గుంటూరు కారం’లో వెంకటరమణా రెడ్డిగా మహేష్ బాబు కనిపించనున్నారట. పాలిటిక్స్ అంటే ఇష్టం లేని రమణారెడ్డి.. గుంటూరు రాజకీయాలను ఎలా శాసించారు అనేదే స్టోరీ అని సోషల్ మీడియాలో ఓ లీక్ వైరల్ అవుతోంది. మూవీలో జనదళం పార్టీ సెక్రటరీ అయిన వైరా వెంకటస్వామి (ప్రకాశ్​ రాజ్) కొడుకే వెంకట రమణారెడ్డి (మహేష్ బాబు) అని నెట్టింట వినిపిస్తోంది.

GG kaaram

రాజకీయాలు అంటే తనకు ఇష్టం లేకపోయినా అనూహ్య పరిస్థితుల్లో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వెంకటరమణా రెడ్డి (మహేష్).. రాజకీయ శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడనే స్టోరీ లీక్ బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించి లీక్ అయిన ఫొటోల్లో జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి వైరా వెంకటస్వామిగా ప్రకాశ్​ రాజ్​ క్యారెక్టర్​కు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ‘గుంటూరు కారం’ నుంచి ఇప్పటిదాకా బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్​తో అందరూ ఇది మాస్ కమర్షియల్ ఎంటర్​టైనర్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న లీక్​లతో పక్కా పొలిటికల్ మూవీలా కనిపిస్తోంది. అయితే ఈ లీక్స్​లో ఎంత నిజం ఉందనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేం. మరి.. ‘గుంటూరు కారం’ కథ ఏ నేపథ్యంలో సాగుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: OTT: అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి యానిమల్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి