iDreamPost
android-app
ios-app

Guntur Kaaram Trailer: మహేశ్ ఊర మాస్.. గుంటూరు కారం ట్రైలర్ ఎలా ఉందంటే?

Mahesh Babu's Guntur Kaaram Trailer Review: సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం. ఈ సంక్రాతికి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu's Guntur Kaaram Trailer Review: సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం. ఈ సంక్రాతికి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Guntur Kaaram Trailer: మహేశ్ ఊర మాస్.. గుంటూరు కారం ట్రైలర్ ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ పేరు వినగానే ఫ్యాన్స్ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అలాంటి మహేశ్ నుంచి మాస్ మూవీ వస్తోందంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అది కూడా సంక్రాంతికి మూవీ వస్తోంది అనగానే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. పైగా త్రివక్రమ్- మహేశ్ బాబు కాంబినేషన్ కాబట్టి సినిమాపై మినిమం అంచనాలు ఉంటాయి. ఇప్పటికే వీల్ల కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కాంబోలో మరో సినిమా అనగానే ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ఇప్పటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ లాంఛ్ అవ్వడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.

నిజానికి గుంటూరు కారం ట్రైలర్ జనవరి 6నే విడుదల కావాల్సింది. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు నిరాకరించడంతో చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే మరో డేట్ అనౌస్ చేస్తామంటూ చెప్పారు. వెంటనే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కూడా పెట్టేశారు. సుదర్శన్ థియేటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలోనే గుంటూరు కారం మూవీ ట్రైలర్ లాంఛ్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ తో మూవీపై అంచనాలు ఏవిధంగా అయితే ఉన్నాయో.. వాటిని ఈ ట్రైలర్ రెండింతలు చేసింది. మహేశ్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, స్టెప్స్ అన్నీ ఊరమాసుగా ఉన్నాయి. ఎక్కడా కూడా అభిమానుల అంచనాలను తగ్గించలేదు.

ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఒకటే ఎలివేషన్.. ఫ్రేమ్ లో మహేశ్ లేకపోయినా కూడా ఆ క్యారెక్టర్ గురించే ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహేశ్ బాబు లుక్స్ ఓ రెంజ్ లో ఉన్నాయి. లుంగీలో, చెక్స్ షర్ట్ లో ఊర మాస్ లుక్స్ లో ఉన్నాడు. ఖలేజా మూవీలో కామెడీ టైమింగ్, అతడు స్టైల్ లో పదునైనా డైలాగులతో ట్రైలర్ నెక్ట్స్ లెవల్లో ఉంది. అబ్బా అబ్బా అబ్బా అనే ఊతపదం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహేశ్ ఇదే చివరి రీజినల్ చిత్రంగా చెబుతున్నారు. రాజమౌళి మూవీ తర్వాత ఇక మహేశ్ నుంచి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మంచి మాస్ మసాలా మూవీ అందించి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారు అని త్రివిక్రమ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. మహేశ్ బాబు గుంటూరు కారం ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş