iDreamPost

రూ.2 లక్షల వరకూ రైతు రుణాలు మాఫీ

రూ.2 లక్షల వరకూ రైతు రుణాలు మాఫీ

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యంతో మహారాష్ట్రలో ఏర్పడిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రెండు లక్షల వరకు రైతులకు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీంటినీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మహా రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. 2019 సెప్టెంబర్‌ 30 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాను.

రైతు రుణాల మాఫీ పథకానికి ‘ మహాత్మా జ్యోతిరావ్‌ పూలే’ పేరు పెట్టారు. రైతు రుణాల మాఫీ విలువ రూ.40 వేల కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్‌ కార్డుతో రైతులు బ్యాంకుకు వెళితే మాఫీకి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయ్యేలా సులువైన ప్రక్రియను ప్రకటించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులుగా పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి