iDreamPost

Gas Cylinder For Rs 500: రూ. 500 కే గ్యాస్ సిలిండర్.. అమల్లోకి వచ్చేది ఈ ఏడాది ఆ తేదీ నుంచే

  • Published Dec 20, 2023 | 11:04 AMUpdated Dec 20, 2023 | 11:04 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనాలంతా ఆత్రుతగా ఎదురు చూస్తోన్న పథకం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. తాజాగా దీన్ని అమలు చేసే తేదీకి సంబంధించి కీలక అప్డేట్ తెలిసింది. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనాలంతా ఆత్రుతగా ఎదురు చూస్తోన్న పథకం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. తాజాగా దీన్ని అమలు చేసే తేదీకి సంబంధించి కీలక అప్డేట్ తెలిసింది. ఆ వివరాలు..

  • Published Dec 20, 2023 | 11:04 AMUpdated Dec 20, 2023 | 11:04 AM
Gas Cylinder For Rs 500: రూ. 500 కే గ్యాస్ సిలిండర్.. అమల్లోకి వచ్చేది ఈ ఏడాది ఆ తేదీ నుంచే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అలానే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే ఎన్నికల్లో విజయం సాధించగానే.. ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఇక జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మరో పథకం.. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇక తాజాగా ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో తేదీని ప్రకటించారు. ఆ వివరాలు..

మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్‌‌ సిలిండర్​ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని.. ఆ‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి అమలు చేయాలని భావిస్తోన్నట్లుగా తెలుస్తోంది.

gas cylinder cost only 500 in telangana

అనగా ఈ ఏడాది డిసెంబర్ 28 నుంచి దీన్ని అమలు చేయాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. సివిల్‌‌ సప్లయ్​​​ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల తయారీలో బిజీగా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది కస్టమర్లు ఉన్నారు.. ఎవరికి ఈ పథకాన్ని వర్తింప జేయాలి.. దీని వల్ల ప్రభుత్వంపై పడే భారం ఎంత.. అనే విషయాలకు సంబంధించి లెక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి 20 లక్షల గ్యాస్‌‌ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు రూ. 3 వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం‘రూ. 500కే సిలిండర్’​ స్కీమ్​కు గైడ్​లైన్స్​ రూపొందించే పనిలో సివిల్​ సప్లయ్స్ ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. కుటుంబాన్ని యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాలా.. లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా.. అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. కేవలం మహిళల పేరుతో గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లను లెక్కలోకి తీసుకుంటే.. అవి 70 లక్షల వరకు ఉన్నాయి.

ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ను కేవలం మహిళలకే ఇవ్వాలని మార్గదర్శాలు జారీ చేస్తే.. అప్పుడు గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లలో ‘నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే ఆప్షన్ అందుబాటులో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటంతో మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపైకి మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్దకు.. కస్టమర్లు క్యూ కట్టే చాన్స్​ ఉంది. మహిళల పేరుమీదున్న కనెక్షన్లకే రూ. 500కు సిలిండర్​ అని మార్గదర్శకాలు రూపొందించినా.. మిగతావాళ్లు కూడా ‘నేమ్​ చేంజ్’ ఆప్షన్​ను ఉపయోగించుకుంటారన్న వాదన వినిపిస్తున్నది. మరి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి