iDreamPost
android-app
ios-app

వీడియో: పాపం.. మహిళను కర్రతో చావకొట్టిన పోలీస్‌..

వీడియో: పాపం.. మహిళను కర్రతో చావకొట్టిన పోలీస్‌..

మధ్య ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్‌ అధికారి మహిళతో దారుణంగా వ్యవహరించాడు. నిరసన తెలపడానికి వచ్చిన ఆమెను కర్రతో చితకబాదాడు. పాపం! కర్ర దెబ్బలకు ఆ మహిళ విలవిల్లాడింది. ఆ వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌కు చెందిన కొంతమంది మహిళలు తమ హక్కుల కోసం రోడ్డుపై నిరసన తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై ముందుకు దూసుకు వెళుతున్న వారిని అడ్డగించారు.

ఓ మహిళ మాత్రం పోలీసుల కానిస్టేబుళ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్లింది. గట్టిగా నినాదాలు చేయసాగింది. దీంతో అక్కడే ఉన్న పోలీస్‌ ఉన్నతాధికారికి కోపం వచ్చింది. కర్రతో ఆమెపై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. కర్ర పక్కకు పడిపోవటంతో చెయ్యితో కూడా దాడి చేశాడు. ఈ లోపల  ఓ లేడీ కానిస్టేబుల్‌ ఆమెను పక్కకు తీసుకువచ్చింది. పోలీస్‌ కొట్టడంతో ఆ మహిళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయనపై కోపం ప్రదర్శించింది.

సదరు పోలీస్‌ మహిళపై దాడికి దిగిన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ఈ మధ్య పోలీస్‌ వాళ్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు’’.. ‘‘ ఇలాంటి పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే విధుల నుంచి తొలగించాలి’’.. ‘‘ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ విధంగా జరుగుతోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş