iDreamPost
android-app
ios-app

ఆ అవమానాన్ని మర్చిపోలేకపోతున్నా.. ఏం చేయాలో నాకు తెలుసు: KL రాహుల్

  • Published May 17, 2024 | 6:46 PM Updated Updated May 17, 2024 | 6:46 PM

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ అవమానాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నానని అన్నాడు. ఏం చేయాలో తనకు బాగా తెలుసునని చెప్పాడు.

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ అవమానాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నానని అన్నాడు. ఏం చేయాలో తనకు బాగా తెలుసునని చెప్పాడు.

  • Published May 17, 2024 | 6:46 PMUpdated May 17, 2024 | 6:46 PM
ఆ అవమానాన్ని మర్చిపోలేకపోతున్నా.. ఏం చేయాలో నాకు తెలుసు: KL రాహుల్

ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జియాంట్స్ తన మార్క్​ను చూపించలేకపోయింది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన రాహుల్ సేన.. వాటిని నిలబెట్టుకోవడంలో ఫెయిలైంది. టోర్నీ ఫస్టాఫ్​లోనే వరుస విజయాలతో అలరించిన లక్నో.. సెకండాఫ్​లో అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్​ రేసు నుంచి తప్పుకుంది. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్​తో రఫ్ఫాడించాడు. 13 మ్యాచుల్లో 465 పరుగులతో సత్తా చాటాడు. బ్యాటర్​గా పరుగుల వరద పారిస్తూనే కెప్టెన్​గానూ టీమ్ గెలుపు కోసం వంద శాతం కష్టపడ్డాడు. అయినా మిగిలిన ఆటగాళ్ల వైఫల్యం జట్టును దెబ్బతీసింది. ఈ తరుణంలో ఎల్​ఎస్​జీ సారథి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ అవమానాన్ని ఇంకా మర్చిపోలేదన్నాడు రాహుల్. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి షేర్ చేశాడు. తనను అందరూ టెస్ట్ బ్యాటర్​గానే చూసేవారన్నాడు. టీ20లు, వన్డేల్లో ఆడటం తన వల్ల కాదంటూ అవమానించారని తెలిపాడు. అయితే దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తనకు తెలుసునని.. అదే చేసి ఇప్పుడీ స్టేజ్​లో ఉన్నానని పేర్కొన్నాడు. ‘కెరీర్ మొదట్లో నేను సిక్స్ కొడితే నేనే ఆశ్చర్యపోయేవాడ్ని. ఎందుకంటే నేను టీ20లు, వన్డేల్లో అంత గొప్పగా ఆడలేదు. దీంతో టెస్ట్ మ్యాచ్ ప్లేయర్​నని నాపై ముద్ర వేశారు. వన్డేలు, టీ20లు ఆడటం నాకు చేతకాదని అవమానించారు. ఆ రెండు ఫార్మాట్లలో ఆడేంత స్కిల్స్, టెక్నిక్స్ నాకు తెలియవని విమర్శించారు’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

వన్డేలు, టీ20లకు తగ్గట్లు తన బ్యాటింగ్ స్టైల్​ను మార్చుకునేందుకు, ఎక్కువ సమయం పట్టిందన్నాడు రాహుల్. ఐపీఎల్-2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బాగా ఆడటంతో తన గురించి అందరూ అభిప్రాయాలు మార్చుకోవడం మొదలైందన్నాడు. అప్పటి నుంచి తనను అన్ని ఫార్మాట్లలోనూ ఆడే సత్తా ఉన్న ప్లేయర్​గా చూడటం స్టార్ట్ అయిందన్నాడు రాహుల్. ఏళ్ల పాటు ఎంతో క్రమశిక్షణతో కష్టపడటం వల్లే తాను సక్సెస్ అయ్యానని పేర్కొన్నాడు. విమర్శించే వాళ్ల అభిప్రాయాలను మార్చాలంటే ఒక్క రోజులో కుదరదని.. అందుకు టైమ్ పడుతుందన్నాడు. ఏళ్ల పాటు తాను పడిన శ్రమ వల్లే ఈ రేంజ్​లో ఉన్నానని వివరించాడు. మరి.. ఈ ఐపీఎల్​లో రాహుల్ పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)