iDreamPost

Love Story Television TRP : లవ్ స్టోరీ హిట్టు – శ్రీదేవి ఫట్టు

Love Story Television TRP : లవ్ స్టోరీ హిట్టు – శ్రీదేవి ఫట్టు

థియేటర్లలో ఆడేసి ఓటిటిలో వచ్చిన సినిమాలకు లాస్ట్ డెస్టినేషన్ శాటిలైట్ ఛానల్స్. డిజిటల్ వినోదానికి ఎన్ని ఆప్షన్లు వచ్చినా ఇప్పటికి సగటు ప్రేక్షకుడికి కొత్త సినిమాలు చూడాలంటే టీవీనే కీలకం. అందుకే వీటి హక్కుల విషయంలో నిర్మాతలు మంచి లాభాలు పొందగలుగుతున్నారు. అంతేసి రేట్లు పెట్టి కొన్న ఛానళ్లకు ఆదాయం వచ్చే మార్గాలు రేటింగులు ప్లస్ యాడ్స్. ఇవి ఎంత వచ్చాయనే దాని మీద సదరు హీరోల తర్వాతి చిత్రాలను కొనే పెట్టుబడులను డిసైడ్ చేసుకుంటారు. కాకపోతే కరోనా దూకుడు వల్ల ఓటిటి విప్లవం వచ్చాక ఛానల్స్ మీద ప్రభావం పడిన మాట వాస్తవం. ప్రొడ్యూసర్లకు ఆదాయం పెరిగింది కానీ వీటికి మాత్రం ఇబ్బంది తప్పలేదు.

ఇక విషయానికి వస్తే ఇటీవలే స్టార్ మాలో వరల్డ్ ప్రీమియర్ జరుపుకున్న లవ్ స్టోరీ అక్కడా బాక్సాఫీస్ ఫలితాన్ని రిపీట్ చేసింది. ఏకంగా 18 రేటింగ్ తో ఉప్పెనకు దగ్గరగా వెళ్లిపోయింది. శేఖర్ కమ్ముల బ్రాండ్ మీద హోమ్ ఆడియన్స్ కి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాయి పల్లవి గ్లామర్, చైతు ఇమేజ్, సారంగదరియా పాట ఇవన్నీ ఇంత స్పందనకు తోడయ్యాయి. సెకండ్ లాక్ డౌన్ తర్వాత అప్పటి పరిస్థితి వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు అధిక శాతం థియేటర్లకు వెళ్ళలేదు. ఆ కారణంగానే లవ్ స్టోరీ 35 కోట్లను దాటలేక కొద్దిపాటి లాభాలతో సంతృప్తి పడింది పడింది. కాకపోతే టాక్ కన్నా పెద్ద హిట్ అయిన మాట వాస్తవం

ఇక జీ తెలుగులో వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ బుల్లితెరపై పెద్దగా మేజిక్ చేయలేకపోయింది. కేవలం 3.5 రేటింగ్ తో సర్దుకుపోవాల్సి వచ్చింది. అదే టైంలో టెలికాస్ట్ అయిన పోటీ సినిమాలు కారణం అయినప్పటికీ జనం దీని పట్ల అంత ఆసక్తి చూపలేదనే క్లారిటీ అయితే వచ్చింది. విజయ్ సేతుపతి లేటెస్ట్ డిజాస్టర్ లాభం దీనికి దగ్గర 2.90 తెచ్చుకుంది. మొత్తానికి లవ్ స్టోరీ 2021 టాప్ 3లో చోటు దక్కించుకుంది. తమిళంలో మొదలైన డైరెక్ట్ శాటిలైట్ ప్రీమియర్లు ఇంకా తెలుగులో ప్రారంభం కాలేదు కానీ అవి కూడా వచ్చాయంటే ఈ రంగంలో ఇంకా గణనీయమైన మార్పులు చూడొచ్చు. ఓటిటిల డామినేషన్ పెరుగుతోంది కనక ఇలాంటివి తప్పవు

Also Read : Maanadu Movie Report : మానాడు సినిమా రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి