iDreamPost

నా లైఫ్‌ ఇలా అయిపోవడానికి కారణం అదే: నాగచైతన్య

  • Published Mar 24, 2024 | 4:40 PMUpdated Mar 24, 2024 | 4:40 PM

Naga Chaitanya: యువసామ్రాట్ నాగచైతన్య ఎంత డిసిప్లెన్ , టైం సెన్స్ తో ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు వాళ్ల అమ్మ కోసం కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. అందుకు చైతూ వాళ్ల అమ్మ కోసం కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.

Naga Chaitanya: యువసామ్రాట్ నాగచైతన్య ఎంత డిసిప్లెన్ , టైం సెన్స్ తో ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు వాళ్ల అమ్మ కోసం కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. అందుకు చైతూ వాళ్ల అమ్మ కోసం కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.

  • Published Mar 24, 2024 | 4:40 PMUpdated Mar 24, 2024 | 4:40 PM
నా లైఫ్‌ ఇలా అయిపోవడానికి కారణం అదే: నాగచైతన్య

యువసామ్రాట్ నాగచైతన్య గురించి అందరికి తెలిసిందే. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత బ్యాక్ టూ బ్యాక్  సినిమాలతో బిజీగా మారిపోయారు.  అయితే ప్రస్తుతం ఈయన కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇక ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్య్వూల్లో పాల్గొన్న నాగ చైతన్యకు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో చైతన్య తల్లి కోసం ఓ ప్రశ్న ఎదురవ్వగా.. అతను కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

హీరో నాగ చైతన్య సినిమాల విషయంలోనే కాకుండా.. బయట కూడా ఎంతో డిసిప్లెన్ , టైం సెన్స్ తో ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇక ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కొన్ని ప్రశ్నలు వేయగా.. అందులో మీకు డిసిప్లెన్, టైం సెన్స్ ఎవరు నేర్పించారు అనే ప్రశ్న ఎదురైంది. ఇక ఆ ప్రశ్నకు చైతూ మాట్లాడుతూ..’ఇది నేను మా తాతగారి నుంచి నేర్చుకున్నాం. క్రమశిక్షణ, టైం సెన్స్ అనేది రామానాయుడు గారు, ఏఎన్నార్ గారు ఇద్దరు నేర్పించారు. ఎందుకంటే.. ఒక మనిషి పలానా టైం చెప్పారంటే.. ఆ సమయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్లు కూడా ఎన్నో పనులు వదులుకుని వస్తుంటారు. అలాంటప్పుడు వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత.. డౌన్ టు ఎర్త్ అనేది అమ్మ, నాన్న ఇద్దరిలో ఎవరు నేర్పించారు అనే ప్రశ్న రావడంతో.. అందుకు చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందుకు చైతూ తన అమ్మ గురించి మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు అంతా అమ్మ దగ్గరే పెరిగాను. 18 సంవత్సరాలు అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మే నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎతిక్స్ ఫాలో అవుతారు. క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్ ఇవన్నీ అమ్మే నాకు నేర్పించారు’ అని తెలిపారు.

ఇక చివరిగా.. మీలో సెన్సిటివ్ నెస్, కొంచెం మీలో మీకు మాత్రమే సర్కిల్ గీసుకుంటూ ఉండిపోయేది అంతా అమ్మ నుంచే వచ్చాయా అని యాంకర్ అడగ్గా.. అందుకు చైతూ కాదని చెపుతూ.. ‘చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ. బాగా కంఫార్ట్ ఉన్నవాళ్లతో ఓపెన్ అప్ అవుతాను. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు. ఒక 20, 30 మంది ఫ్రెండ్స్ వద్దు. రోజుకు ఇద్దరు ముగ్గురిని కలవడం నాకు ఇష్టం ఉండదు. నలుగురు, ఐదుగురు ఉంటే చాలు. అందులో నిజాయితీగా ఉండే వాళ్లు మాత్రమే ఉండాలి. అలాగే నేను తప్పు చేస్తే నాకు చెప్పాలి. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అది చాలు అంటూ చెప్పుకువచ్చారు’. ఇక ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు విన్న నెటిజన్స్ చైతూ మనసు ఎంత గొప్పదని.. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరి, నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి పంచుకున్న విషయాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి