iDreamPost

జమాత్ ప్రార్థనలో పాల్గొన్న విదేశీయులపై లుక్ ఔట్ నోటీస్ జారీ చేసిన క్రైమ్ బ్రాంచ్

జమాత్ ప్రార్థనలో పాల్గొన్న విదేశీయులపై లుక్ ఔట్ నోటీస్ జారీ చేసిన క్రైమ్ బ్రాంచ్

తబ్లీఘీ జమాత్ ప్రార్థనలలో పాల్గొన్న 1890 మంది విదేశీయులపై క్రైమ్ బ్రాంచ్ లుక్ ఔట్ నోటీస్(LOC) జారీ చేసింది. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించి జమాత్ ప్రార్థనలలో పాల్గొన్నట్లు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో తేలింది.ఈ మత ప్రార్థనలలో పాల్గొన్న చాలామందికి కరోనా వైరస్ సోకడంతో దేశంలో ఈ వైరస్ బాధితుల సంఖ్య భారీగా పెరిగింది.వీసా గడువు తీరినా భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తమ తమ దేశాలకు పంపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.జమాత్‌లో పాల్గొన్న విదేశీయులంతా స్వచ్ఛందంగా తమంతట తామే ముందుకొచ్చి తమ వివరాలను తెలపాలని కేంద్రం కోరింది.వివరాలు వెల్లడించిన విదేశీయులను వారి దేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ విచారణకు రావాల్సిందిగా 18 మందికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు తబ్లీఘీ ప్రార్థనలలో పాల్గొన్న 1500 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో 400 మంది విదేశీయులూ ఉన్నారు.పర్యాటక వీసాలపై వచ్చిన వీరు ఢిల్లీలోని మాల్వియా నగర్‌,శాస్త్రిపార్క్,చాందినీ మహల్,తుర్క్‌మాన్ గేట్,హౌరానీ, వజీరాబాద్ ప్రాంతాలలో తమ బంధువుల ఇళ్లలోనూ, మసీదులోనూ అక్రమంగా ఉంటున్నారు.ఈప్రాంతాలపై రైడ్ చేసిన క్రైమ్ బ్రాంచ్ అక్రమ నిర్వాసితులను అదుపులోకి తీసుకుంది. అయితే జమాత్ ప్రార్ధన సంఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడిచినప్పటికీ దర్యాప్తు పూర్తి కాకపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి