iDreamPost

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన లోకీ వస్తున్నాడు! సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Author Soma Sekhar Published - 09:58 AM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Published - 09:58 AM, Fri - 22 September 23
ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన లోకీ వస్తున్నాడు! సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించడంలో హాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ ముందుంటాయి. మార్వెల్, డీసీ స్టూడియోల నుంచి సినిమాల కోసం సిరీస్ ల కోసం ఎంతో ఆత్రుతతో వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి వారికోసం తిరిగి వస్తున్నాడు ‘లోకీ’. తాజాగా లోకీ సీజన్ 2 కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మార్వెల్ అభిమానులు రెడీగా ఉండాలని లోకీ కోరాడు. అయితే ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ వస్తుందా? అని టీజర్ వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు సినీ ప్రేమికులు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. మేకర్స్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఈ సీజన్ ఎందుకి రానుందంటే?

వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ను ఉర్రూతలూగించిన లోకీ తిరిగి వస్తున్నాడు. లోకీ సీజన్ 2కు సంబంధించి టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా.. సీజన్ తొలి ఎపిసోడ్ అక్టోబర్ 6 ఉదయం 6:30 గంటల నుంచి డిస్ని+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో మార్వెల్ అభిమానలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇందులో గతంలోకి, భవిష్యత్ లోకి అనుకోకుండా ప్రయానిస్తున్న లోకీకి ఓ విషయం తెలుస్తుంది. ప్రపంచ మానవాళికి పెను ప్రమాదం ఎదురౌతుందని తెలుసుకున్న లోకీ వారిని రక్షించడానికి చేసే పోరాటమే ఈ లోకీ సీజన్ 2. ఈ సీజన్ ప్రేక్షకులకు వైల్డ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా.. లోకీ క్యారెక్టర్ లో మరోసారి తన నటనా విశ్వరూపం చూపించాడు టామ్ హిడిల్ స్టన్. ఇది టీజర్ లోనే తెలిసిపోతోంది. ఇక ఈ సీజన్ లో కొత్త నటులు పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. లోకీ సీజన్ 2ను డైరెక్టర్లు జస్టిన్ బెన్సన్, ఆరోన్ మూర్ హెడ్, డాన్ డెలీవ్, కస్రా ఫరాహానీలు తెరకెక్కించారు. మరి లోకీ ఏ విధంగా ప్రేక్షకులను అబ్బురపరుస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి లోకీ సీజన్ 2 టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి