iDreamPost

మిడతలను రాష్ట్రంలోకి రానీయకుండా చేయీలట..లోకేష్ తెలివి

మిడతలను రాష్ట్రంలోకి రానీయకుండా చేయీలట..లోకేష్ తెలివి

తెలుగుదేశంపార్టీ వాళ్ళకు పొద్దున లేచిందగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారావారి పుత్రరత్నం లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాయటం ఇందులో భాగమే. ఇంతకీ లోకేష్ తాజాగా మాట్లాడిందేమంటే మిడతల దండును రాష్ట్రంలోకి రానీయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలట. తాము ఎప్పటి నుండో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు కూడా లోకేష్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, కాబట్టి ఈ విషయంలో అయినా వెంటనే మేల్కోవాలంటూ హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది.

ప్రభుత్వం పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకుని జగన్ కు లోకేష్ లేఖ రాసినట్లు అర్ధమైపోతోంది. పంటలను నాశనం చేస్తున్న మిడతలను రాష్ట్రంలోకి రానీయకుండా చేయటం సాధ్యమేనా ? మిడతల దాడివల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవటానికి చర్యలు తీసుకోవాలని అడగటంలో అర్ధముంటుంది. అంతేకానీ అసలు రాష్ట్రంలోకే రానీయొద్దంటే ఎలా సాధ్యమో ? లోకేష్ చెప్పాలి. మిడతల దండును ఆపడమంటే సిబిఐని రాష్ట్రంలోకి రానీయకుండా అడ్డుకుంటూ నిర్ణయం తీసుకోవటమా ?

పైగా లోకేష్ పరిజ్ఞానం ఎలాగుందంటే ఇప్పటికే మిడతలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేయటం కూడా విచిత్రంగా ఉంది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు, రాయదుర్గం మండలాల్లో జిల్లేళ్ళ చెట్టుమీద కనిపించిన మిడతలు హానికరం కాదని శాస్త్రవేత్తలు చెప్పినా లోకేష్ వినటం లేదు. సోమాలియా, ఇధియోపియా నుండి వచ్చే మిడతలు లక్షలు, కోట్లు ఒకేసారి పంటలపై దాడి చేస్తాయి. చాలా కొద్దిసేపటిలోనే హెక్టార్ల పరిధిలోని పంటలను తినేస్తాయి. ఇటువంటి మిడతలు ఉత్తరభారతంలోనే ఉన్నాయి.

ఇటువంటి మిడతలు తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాకు రెండువందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మహారాష్ట్రలో కనిపించిన మిడతలు ఇంకా తెలంగాణాలోకో లేకపోతే కర్నాటకలోకే ప్రవేశించనపుడు ఏపిలోకి ఎలా కనిపించాయో లోకేష్ చెప్పాలి. ఇక కరోనా వైరస్ విషయంలో కూడా ప్రభుత్వం సమర్ధంవంతంగా పనిచేస్తున్నపుడు కేంద్రప్రభుత్వమే చెప్పిన విషయం బహుశా లోకేష్ మరచిపోయినట్లున్నాడు. కాబట్టి కరోనా వైరస్ గురించైనా, మిడతల సమస్యను అయినా ప్రభుత్వం తనకున్న పరిధిలో పరిష్కరించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటుందని లోకేష్ గ్రహించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి