iDreamPost

ఒంగోలులో సోమవారంనుండి మళ్ళీ లాక్ డౌన్…

ఒంగోలులో సోమవారంనుండి మళ్ళీ లాక్ డౌన్…

లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి బాగా పెరిగింది. దాంతో దేశంలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ మళ్ళీ విధిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో చెన్నై సహా నాలుగు జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో మళ్ళీ లాక్ డౌన్ విధించారు.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి బాగా పెరిగింది.నిన్న తాజాగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోడవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యధిక కేసులు ప్రకాశం జిల్లా రాజధాని ఒంగోలులో నమోదవుతుండడంతో ఒంగోలులో మళ్లీ లాక్ డౌన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. దాంతో సోమవారం నుంచి 14 రోజుల పాటు ఒంగోలు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ అమల్లో ఉంటుంది.

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకూ 296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కాగా 95 మంది డిశ్చార్జ్ కాగా 62 మంది చికిత్స పొందుతున్నారు…ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు వచ్చాయి.  జిల్లాలో కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 465  మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,961 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా 3065  మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 3069 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి