iDreamPost

లాక్‌డౌన్‌ విధింపుతో దేశం ఆర్థికంగా నష్టపోతుందని బీజేపీ గ్రహించలేదని విమర్శించిన సోనియాగాంధీ

లాక్‌డౌన్‌ విధింపుతో దేశం ఆర్థికంగా నష్టపోతుందని బీజేపీ గ్రహించలేదని విమర్శించిన సోనియాగాంధీ

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి విధించిన రెండు నెలల లాక్ డౌన్‌ కారణంగా దేశం మొత్తం నష్టపోయిందని, అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంకా దీనిని గ్రహించలేదని కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ విమ‌ర్శించారు. ఇంటికి తిరిగి వెళ్ళిన వలస కార్మికులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధిని కోల్పోయిన ప్రజలు ఎక్కువగా నష్టపోయారని ఆమె అన్నారు. భారత దేశం వలస కార్మికుల‌ బాధను చూసిందని, కానీ బిజెపి మాత్రం చూడ‌లేని ఎద్దేవా చేశారు. కోవిడ్ -19 లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇంటికి చేరుకోవడానికి వలస కార్మికులు రహదారుల గుండా, వారిలో చాలామంది కాలిన‌డ‌క‌న వెల్ల‌డంతో దేశానికి అపార‌మైన బాధ‌ను మిగిల్చింద‌ని అన్నారు. చాలా మంది ప్ర‌జ‌లు కులాలు, మ‌తాల‌కు అతీతంగా మాన‌వ‌త్వంతో వ‌ల‌స కార్మికుల‌కు ఆహారం, నీరు, ఇత‌ర అనేక తినిబండారాలు అందిస్తున్నార‌ని తెలిపారు. నాల్గో ద‌శ లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుంద‌న్నారు. “ఉంకా దర్, ఉంకి సిస్కి, ఉంకి పీడా దేష్ మెయిన్ సబ్నే సుని, పార్ షాయద్ సర్కార్ నే నహి (అందరూ మీ బాధను చూశారు, మీ కేకలు విన్నారు, కానీ ప్రభుత్వం ఇంకా చూడలేదు)” అని సోనియా గాంధీ అన్నారు.

గురువారం నాడు సోనియా గాంధీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ముందు పేదలు, వలస కార్మికులు, చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి ప్రజల గొంతు వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ ‘స్పీక్‌అప్’ ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికి వచ్చే ఆరు నెలల పాటు రూ. 7,500 ఇవ్వాల‌ని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే త‌క్ష‌ణ‌మే వారికి రూ. 10,000 కూడా ఇవ్వాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. లాక్ డౌన్‌ దేశాన్ని బాధపెడుతోందని, అయితే ప్రభుత్వం ఇంకా స్పందించలేద‌ని అన్నారు. చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఉచిత, సురక్షితమైన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని, వారి ఉపాధికి కూడా ఏర్పాట్లు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. “గత రెండు నెలలుగా కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్‌ ఎదుర్కొంటున్న సవాళ్ళ కారణంగా దేశం మొత్తం జీవనోపాధి, ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది” అని చెప్పారు.

మిలియన్ల వ‌ల‌స కార్మికులు మెడిష‌న్‌, ఆహారం లేకుండా వేలాది కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఆకలితో, దాహంతో నడుస్తున్న చిత్రాలు స్వాతంత్ర్యం తరువాత మొదటిసారిగా భారతీయులు చూశారని తెలిపారు. “కోట్ల ఉద్యోగాలు పోయాయి, మిలియన్ల వ్యాపారాలు నాశనమయ్యాయి, కర్మాగారాలు మూసివేయబడ్డాయి, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం మొత్తం బాధపడింది. కానీ బహుశా ప్రభుత్వం దానిని గ్రహించలేదు” అని ఆమె అన్నారు. ఈ అంశంపై నిపుణులు చేసిన సూచ‌న‌ల‌కు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ చూపలేదన్నారు. ఖజానా తాళం తెరిచి అవసరమైన వారికి సహాయం అందించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

“ఎంజిఎన్ఆర్ఇజిఎ కింద ఉపాధి రోజులను 200 కి పెంచండి, తద్వారా వారు తమ గ్రామాల్లో ఉద్యోగాలు పొందవచ్చ” అని ఆమె అన్నారు. ఈ కఠినమైన సమయాల్లో చిన్న‌, మ‌ధ్య‌ తరహా పరిశ్రమలకు ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా కోట్ల ఉద్యోగాలు ఆదా అవుతాయ‌ని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి