iDreamPost

లాక్ డౌన్ – బొట్టుపెట్టి హారతి ఇచ్చి …

లాక్ డౌన్ – బొట్టుపెట్టి హారతి ఇచ్చి …

లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేస్తూ అవసరం ఉన్నా లేకున్నా బయటికి వస్తున్న వారి పట్ల పోలీసుల ప్రవర్తన పై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతుండడంతో పలు ప్రాంతాల పోలీసులు తమ శైలి మార్చుకొని కొత్త తరహా కౌన్సిలింగ్ ఇవ్వటం ప్రారంభించారు .

కొన్ని ప్రాంతాల్లో శాంతియుత నిరసన తరహాలో తెల్లని పువ్వు ఇచ్చి బతిమాలుతున్న ధోరణిలో లాక్ డౌన్ నిబంధనలు పాటించమని , అనవసరంగా బయటికి రావద్దని చెబుతూ ఉండగా , మరి కొన్ని చోట్ల మహిళా కానిస్టేబుళ్ల చేత హారతి ఇచ్చి మరీ చెప్పిస్తున్నారు .

ఒక పట్టణంలో అయితే ఏకంగా మహిళా కానిస్టేబుల్ చేత బొట్టు , చెవిలో పువ్వు పెట్టించి దణ్ణం పెట్టి అనవసరంగా బయటికి చెప్పి భారత్ మాతాకి జై అని నినదించి పంపిస్తున్నారు .

ఎందుకిలా అని ఆరా తీయగా లాక్ డౌన్ నిబంధనలు అనుసరించకుండా , సోషల్ డిస్టన్స్ పాటించకుండా అనవసరంగా బయటికి వచ్చేవారిని అదుపు చేయడం తలకు మించిన భారం అవుతుందని , ఒత్తిడికి గురయ్యి ఒకటి రెండు సార్లు లాఠీలకు పని చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండటం లేదని …గాంధీ గిరి తరహాలో బొట్టుపెట్టి హార్ట్య్ ఇచ్చి చెప్తేనన్న అర్ధం చేసుకుంటారని బదులిచ్చారు.

అయినా వారిలో మార్పు రాకపోతే అని ప్రశ్నించగా..మార్పు రాకపోతే రెండో సారి తమదైన పాత శైలిలో మరోసారి గట్టిగా చెబుతామని నవ్వుతూ వ్యాఖ్యానించారు .

ఏదేమైనా ఈ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసుల పని కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్టు తయారయ్యిందని చెప్పొచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి