iDreamPost
android-app
ios-app

తెలుగు తెరపైకి పెద్ద సినిమాల దండయాత్ర! ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారంటే?

Tollywood Up Coming Movies 2024: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమా లవర్స్ అంతా టాలీవుడ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ ఏడాది సెకండాఫ్ మొత్తం బిగ్ బిగ్ సినిమాలు క్యూలో ఉన్నాయి.

Tollywood Up Coming Movies 2024: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమా లవర్స్ అంతా టాలీవుడ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ ఏడాది సెకండాఫ్ మొత్తం బిగ్ బిగ్ సినిమాలు క్యూలో ఉన్నాయి.

తెలుగు తెరపైకి పెద్ద సినిమాల దండయాత్ర! ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారంటే?

గతంలో అంటే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు. అక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఏ హీరో మూవీ ఈ ఏడాది రాబోతోంది? అంటూ తెగ వెతికేశేవాళ్లు. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. టాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? అని పాన్ ఇండియా మూవీ లవర్స్ వెతుకులాట మొదలు పెట్టారు. అంతేకాకుండా టాలీవుడ్ నుంచి సినిమా వస్తోంది అంటే బాలీవుడ్ వాళ్లు మూవీస్ ని పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా.. సౌత్ డైరెక్టర్ అయితేనే మనకు హిట్స్ ఇవ్వగలరు అనే అభిప్రాయం కూడా బీ టౌన్ స్టార్ల మైండ్ లోకి బాగా నాటుకుపోయింది. మరి.. ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి ఏ స్టార్ ఎప్పుడు రాబోతున్నాడు? ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతోందో చూద్దాం.

నిజానికి ఈ 2024 ఏడాది మొత్తం స్టార్ హీరోల సినిమాలు ఉండాల్సి ఉంది. కానీ, ఫస్ట్ హాఫ్ రావాల్సిన సినిమాలు అన్నీ అనుకోని కారణాలు, షూటింగ్ డిలే వల్ల సెకండాఫ్ కి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో 2024 రాబోయే రోజుల్లో బిగ్ స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు మొత్తం మోత మోగిపోనున్నాయి. నిజానికి ఇప్పుడు విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడటంతో స్టార్ హీరోల సినిమాలు లేకుండా పోయాయి. జూన్ లో వస్తున్నాం అంటూ ఇండియన్ 2కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ, ఏ రోజు వస్తోంది చెప్పలేదు. అందుకే ఆ మూవీపై కూడా ఆడియన్స్ నమ్మకాలు పెట్టుకోవడం లేదు.

Indian

సెకండాఫ్ లో మాత్రం షూర్ షాట్ గా వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. మే 9కి రావాల్సిన కల్కి సినిమా వాయిదా పడింది. అయితే జూలై నెలలో ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలా చూసుకుంటే సెకండాఫ్ లో వస్తున్న తొలి బిగ్ మూవీ కల్కీనే అవుతుంది. ఆ తర్వాత పంద్రాగస్టుకి పుష్పరాజ్ రానే వస్తున్నాడు. తప్పకుండా అదే డేట్ కి వస్తామంటూ పుష్ప 2 మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీస్ తర్వాత పవన్ కల్యాణ్ ఓజీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సెప్టెంబర్ 27 అంటున్నారు కానీ, ఇంకా క్లారిటీ లేదు. ఇంక దేవర అక్టోబర్ 10కి రాబోతున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కూడా కచ్చితంగా ఈ ఏడాదికే వచ్చే అవకాశం ఉంది. తేదీ చెప్పకపోయినా.. ఈ ఇయర్ మాత్రం కన్ఫామ్ అంటున్నారు. ఈ బిగ్ స్టార్స్ మాత్రమే కాకుండా ఆగస్టు 29న నాని సరిపోదా శనివారం ఉంది. నాగచైతన్య తండేల్ మూవీ డిసెంబర్ 20కి రాబోతోంది అంటున్నారు. నితిన్ రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ 20కి వస్తున్నాం అని అధికారికంగా ప్రకటన చేశారు. ఇవి మాత్రమే కాకుండా డబ్బింగ్ చిత్రాలకు కొదవ లేదు. వాటిలో మరీ ముఖ్యంగా రజినీకాంత్ వెట్టాయన్, విక్రమ్ తంగలాన్, సూర్యా కంగువ, విజయ్ గోట్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి.. సెకండాఫ్ పాన్ ఇండియా లెవల్లో సౌత్ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమైపోతున్నాయి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet