iDreamPost

సిక్సర్లతో శివాలెత్తిన ఊతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..!

శ్రీలంక వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో పరుగుల వరదపారిస్తున్నాడు టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప. తాజాగా దుబాయ్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సిక్సర్లతో శివాలెత్తించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

శ్రీలంక వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో పరుగుల వరదపారిస్తున్నాడు టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప. తాజాగా దుబాయ్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సిక్సర్లతో శివాలెత్తించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

సిక్సర్లతో శివాలెత్తిన ఊతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..!

కొందరు క్రికెటర్లకు వయసు మీదపడుతున్న కొద్ది ఆట రాటుదేలుతుందనుకుంటా. ఈ విషయం ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు నిరూపించారు కూడా. వారి కంటే తానేం తక్కువ కాదంటూ 38 ఏళ్ల టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప చెలరేగిపోతున్నాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో పరుగుల వరదపారిస్తున్నాడు. తాజాగా దుబాయ్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమేహద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్లతో శివాలెత్తాడు. కేవలం 34 బంతుల్లోనే..

రాబిన్ ఊతప్ప.. టీమిండియా తరఫున ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ, మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలు లీగుల్లో మెరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో రాజస్తాన్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ట్రోఫీలో భాగంగా ఆదివారం(మార్చి 17) దుబాయ్ జెయింట్స్ తో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు ఊతప్ప. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ టీమ్ నిర్ణీత 15 ఓవర్లలో కేవలం 3 వికెట్లు నష్టపోయి 208 పరుగుల భారీ స్కోర్ చేసిందంటే దానికి కారణం ఊతప్ప.

Oothappa with the sixers

ఓపెనర్ గా బరిలోకి దిగిన ఊతప్ప ఆది నుంచే దుబాయ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సులు, ఫోర్లతో శివాలెత్తాడు. అతడి బ్యాటింగ్ దాటికి ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ వయసులో కూడా ఇలాంటి ఆట ఏంటి సామి? అంటూ స్టేడియంలో ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ మ్యాచ్ లో కేవలం 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఏకంగా 223 స్ట్రైక్ రేట్ తో ఊతప్ప బ్యాటింగ్ ఊచకోత జరిగింది. అతడికి తోడు జింబాబ్వే బ్యాటర్ మసకద్జ 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 రన్స్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది రాజస్తాన్ టీమ్.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన దుబాయ్ టీమ్ 13.5 ఓవర్లకు 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 14 పరుగులతో ఓటమిపాలైంది. జట్టులో గురుకీరత్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ తో బెంబేలెత్తించాడు. కేవలం 21 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. రాజస్తాన్ బౌలర్లలో చతురంగ డి సిల్వా 5 వికెట్లతో చెలరేగాడు. ఇక ఈ లీగ్ లో ఊతప్ప భీకర ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 ఫిఫ్టీలతో అదరగొట్టాడు. మరి సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న ఊతప్పపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: WPL టైటిల్ విన్నింగ్.. లేడీ కోహ్లీకి గ్రౌండ్ లోనే సర్ ప్రైజ్ ఇచ్చిన విరాట్! వీడియో వైరల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి