iDreamPost

WPL టైటిల్ విన్నింగ్.. లేడీ కోహ్లీకి గ్రౌండ్ లోనే సర్ ప్రైజ్ ఇచ్చిన విరాట్! వీడియో వైరల్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఎగరేసుకుపోయింది. ఫైనల్ చేరిన తొలిసారే ఈ ఘనత సాధించింది ఆర్సీబీ ఉమెన్స్ టీమ్. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ వారికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఎగరేసుకుపోయింది. ఫైనల్ చేరిన తొలిసారే ఈ ఘనత సాధించింది ఆర్సీబీ ఉమెన్స్ టీమ్. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ వారికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

WPL టైటిల్ విన్నింగ్.. లేడీ కోహ్లీకి గ్రౌండ్ లోనే సర్ ప్రైజ్ ఇచ్చిన విరాట్! వీడియో వైరల్

ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓ కప్ వచ్చింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను లేడీ కోహ్లీ స్మృతి మంధాన నాయకత్వంలో ఆర్సీబీ టీమ్ కైవసం చేసుకుంది. ఈ లీగ్ లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించింది ఆర్సీబీ. లీగ్ దశలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఫైనల్ కు చేరి.. టైటిలో పోరులో సమష్టిగా అదరగొట్టింది. దీంతో 16 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కలను నెరవేర్చుకుంది. ఇక ఆర్సీబీ మహిళల టీమ్ ఛాంపియన్ గా నిలిచిన వెంటనే గ్రౌండ్ లోనే స్మృతి మంధానతో పాటుగా టీమ్ మెుత్తానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు కింగ్ విరాట్ కోహ్లీ. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటి? చూద్దాం పదండి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఎగరేసుకుపోయింది. ఫైనల్ చేరిన తొలిసారి ఈ ఘనత సాధించింది ఆర్సీబీ ఉమెన్స్ టీమ్. కాగా.. రెండు సీజన్లలో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. గతేడాది ముంబై చేతిలో ఓడిన ఢిల్లీకి ఈసారి ఆర్సీబీ షాకిచ్చింది. ఐపీఎల్ లో పురుషుల జట్టు చేయలేని పనిని మహిళల టీమ్ చేసి చూపించింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచిన వెంటనే లేడీ కోహ్లీ, కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ ద్వారా అభినందనలు తెలిపాడు కింగ్ విరాట్ కోహ్లీ.

King Kohli's surprise for Lady Kohli

స్మృతితో మాట్లాడిన తర్వాత టీమ్ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేశాడు విరాట్. కోహ్లీ మాట్లాడుతున్నంత సేపు ప్లేయర్లు సంతోషంతో గోల గోల చేశారు. చెప్పలేని ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను లీగ్ నిర్వాహకులు ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 18.3 ఓవర్లలోనే 113 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. అనంతరం 114 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. దీంతో తొలి కప్ ను ముద్దాడింది. మరి ఉమెన్స్ టీమ్ కు వీడియో కాల్ ద్వారా విరాట్ కోహ్లీ అభినందనలు తెలియజేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపండి.

ఇదికూడా చదవండి: WPL 2024.. 16 ఏళ్ల నిరీక్షణకు తెర! ఛాంపియన్ గా RCB.. ఇక కోహ్లీ వంతు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి