iDreamPost
android-app
ios-app

ప్రియుడిని మరువలేక.. ప్రియురాలు ఊహించని పని!

  • Author Soma Sekhar Published - 09:42 AM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Published - 09:42 AM, Tue - 22 August 23
ప్రియుడిని మరువలేక.. ప్రియురాలు ఊహించని పని!

ఆమె ప్రేమ అగ్నికంటే స్వచ్చమైనది.. అందుకే ఆ అగ్నికే ఆహుతి అయ్యింది. ఆమె ప్రేమ.. ప్రేమకే చిరునామా. కానీ ఇప్పుడా చిరునామా కనుమరుగైంది. ప్రేమ మత్తులో ఆ యువతి మునిగిపోతే.. గంజాయి మత్తులో ప్రియుడు తేలిపోయాడు. ప్రేమకు బానిసగా మారిన ఆ యువతి.. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకపోయింది. అతడు లేని జీవితం శూన్యంలా భావించి.. రెండు నెలలు నరకం అనుభవించి.. చివరికి ఆ శూన్యంలోనే కలిసిపోయింది మౌనిక. మీటింగ్, చాటింగ్, డేటింగ్ లాంటి మోసపూరిత ప్రేమలు ఉన్న ఈ లోకంలో.. మౌనిక లాంటి అమ్మాయి ఉండటం ఆశ్చర్యమే. స్వచ్చమైన ప్రేమలో విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆమె పేరు మౌనిక(22). యానాంలోని యూకేవీనగర్ లో తన మేనమామ త్రిమమూర్తులు సంరక్షణలో ఉంటూ.. రాయల్ కాలేజీలో నర్సింగ్ చదువుకుంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నా అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇది ఈ కాలం నాటి ప్రేమ కాదు. అంటే మోసం చేసి వదిలేసే ప్రేమ కాదు. ఈ రోజుల్లో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలను, అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్న సంఘటనలు సమాజంలో అనేకం చూస్తూనే ఉన్నాం.

కానీ మౌనిక ప్రేమ అలాంటిది కాదు. రెండు నెలల క్రితం గంజాయికి బానిస అయిన మౌనిక ప్రియుడు చిన్నా.. తన సోదరుడు రూ. 500 అడిగితే ఇవ్వలేదని పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటి నుంచి ప్రియుడినే తలచుకుంటూ నరకం అనుభవించింది మౌనిక. కాలేజికి వెళ్లకపోయేది, అన్నం ముట్టక పోయేది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను, ఫొటోలను తన గదిలో పెట్టకుని వాటినే చూసుకుంటూ.. మానసికంగా కుంగిపోయింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకపోయిన మౌనిక.. సోమవారం ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మౌనిక మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మౌనిక మృతదేహానికి ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. ప్రేమ పేరుతో మోసం చేసి, వాడుకుని వదిలే వారున్న ఈ రోజుల్లో మౌనిక లాంటి ప్రియురాలు ఉండటం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. ఈ సంఘటన చూసి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. ఇలానే ఉంటుందేమో అంటున్నారు నెటిజన్స్. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమా? మౌనికా నీకు హ్యాట్సాఫ్ అంటూ కొంతమంది నెటిజనులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: వారంలో పెళ్లి అనగా.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş