iDreamPost

ప్రియుడి కోసం రూ.2484 కోట్లు వదిలేసిన యువతి! ఇది కదా ప్రేమంటే?

ప్రేమ అనే రెండు అక్షరాల పదం ఎంత పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వచ్ఛమైన ప్రేమకు ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. ఆ విధంగా ఓయువతి తాను ప్రేమించిన యువకుడి కోసం వేల కోట్ల ఆస్తిని తృణపాయంగా వదిలేసింది.

ప్రేమ అనే రెండు అక్షరాల పదం ఎంత పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వచ్ఛమైన ప్రేమకు ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. ఆ విధంగా ఓయువతి తాను ప్రేమించిన యువకుడి కోసం వేల కోట్ల ఆస్తిని తృణపాయంగా వదిలేసింది.

ప్రియుడి కోసం రూ.2484 కోట్లు వదిలేసిన యువతి! ఇది కదా ప్రేమంటే?

ఎన్నో రకలా భావాలు మనిషి బంధిస్తుంటాయి. అలాంటి వాటిల్లో రెండు అక్షరాల ప్రేమ ఒకటి. దీనికి ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రేమ ముందు ఎంతటి త్యాగమైన చిన్నగానే అనిపిస్తుంది. ప్రేమించిన వారి కోసం ఎంతోమంది..తమ జీవితాలనే త్యాగం చేశారు. అయితే నేటికాలంలో స్వచ్ఛమైన ప్రేమలు అనేవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. స్వార్థం తో కూడిన ప్రేమలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమాజంలో కూడా  ప్రేమించిన వ్యక్తి కోసం ఓ యువతి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి కోసం వేలకోట్ల ఆస్తిని తృణప్రాయంగా వదిలేసింది. మరి.. యువతి ఎవరు?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్  అనే యువతే తన ప్రేమ కోసం ఈ  త్యాగం చేసింది. మలేషియా వ్యాపారవేత్త కూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమెను…తన తల్లిదండ్రులు ఎంతో గారబంగా, ప్రేమగా పెంచుకున్నారు. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు ఏంజెలిన్ ప్రేమలో పడింది. తన క్లాస్‌మేట్ అయిన జెడిడియాతో ఏంజెలిన్ ప్రేమలో పడింది. అతడి ప్రవర్తన, గుణం.. ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అందుకే అతడు తన స్థాయి వ్యక్తికాదని తెలిసిన.. గుణంలో మాత్రం పెద్ద ధనవంతుడని భావించింది. అందుకే అతడిని గాఢంగా ప్రేమించింది. అంతేకాక తన ప్రేమ గురించి ఏంజెలిన్ తల్లిదండ్రులకు చెప్పగా, వారు అంగీకరించలేదు. ఆ యువతి తండ్రి డబ్బు, ఆస్తి, హోదా వంటి కారణాలతో వారి ప్రేమను అంగీకరించలేదు. ఇక తల్లిదండ్రుల ఆస్తి కంటే.. ప్రేమించిన వ్యక్తే ముఖ్యమని ఏంజెల్ భావించింది. అందుకే తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంది. తన ప్రేమికుడు జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికి ఏంజెల్ కు వచ్చిన 300 మిలియన్ డాలర్లను తిరస్కరించింది.

అవి మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2,484కోట్ల ఆస్తి ఉంటుంది. ఇక తన తల్లిదండ్రులను, వారి ఆస్తిని కాదనుకుని ఏంజెలిన్ 2008లో జెడిడియా వివాహం చేసుకున్నారు. ఏంజెలిన్ మాదిరిగానే, జపాన్ యువరాణి మాకో కూడా 2021లో తన కాలేజీ  ఫ్రైండ్ అయినా కొమురోవాను వివాహం చేసుకోవడానికి వారసత్వంగా వచ్చిన తన రాయల్ బిరుదును వదులుకున్నారు. నిజమైన ప్రేమ అనేది ఆస్తులు లేదా ఆర్థిక స్థితి గురించి కాదు, ప్రేమ ఐక్యత వంటి ప్రాథమిక మానవ అవసరాలకు సంబంధించినది అని ఏంజెలిన్ కథ ద్వారా మరోసారి రుజువైంది. ఆమె ప్రేమ పెళ్లిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి