iDreamPost
android-app
ios-app

రోజాపై బండారు వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఖుష్బు!

  • Published Oct 06, 2023 | 1:43 PM Updated Updated Oct 06, 2023 | 1:43 PM
  • Published Oct 06, 2023 | 1:43 PMUpdated Oct 06, 2023 | 1:43 PM
రోజాపై బండారు వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఖుష్బు!

ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి .. నగరి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు బండారు.. రోజాకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ నేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ నేతలను చంద్రబాబు వర్గీయులు టార్గెట్ చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు. తాజాగా బీజేపీ మహిళా నేత, నటి ఖుష్బు సైతం బండారు వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.

నటి ఖుష్బు మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహిళలకు ఎంతో గౌరవం ఇస్తున్నారని.. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, జుగుప్సాకరమైనవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తననానికి పరాకాష్ట అన్నారు. ఈ విషయంలో నేను మంత్రి రోజాకు మద్దతు ఇస్తున్నాను. మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో.. బండారు లాంటి నేతలు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడుతారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే రోజాకి బండారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet