iDreamPost

తెలుగు కుర్రోడి అద్భుత సృష్టి.. 3 వేలతో మ్యాజిక్ బైక్!

  • Author Soma Sekhar Published - 09:10 AM, Wed - 19 July 23
  • Author Soma Sekhar Published - 09:10 AM, Wed - 19 July 23
తెలుగు కుర్రోడి అద్భుత సృష్టి.. 3 వేలతో మ్యాజిక్ బైక్!

కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే.. ఈలోకంలో మనిషి సాధించలేనిది ఏదీ లేదు. అయితే కొంత మంది పేదరికం అడ్డుగా ఉందని, ఇంట్లో పరిస్థితులు బాలేవు అని ఏవేవో సాకులు చెబుతూ.. కాలం వెల్లదీస్తూ ఉంటారు. కానీ ఈ కుర్రాడు అలాంటి వాడు కాదు. పేదరికం వెక్కిరించినా, కూటికోసం వలస వెళ్లినా.. ఏదో సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాడు. తపనతో తనలో ఉన్న మేధస్సుకు పదును పెట్టాడు. మెకానిక్ గా పని మెుదలు పెట్టిన అతడు.. ఈరోజు కేవలం రూ.3 వేల రూపాయాల ఖర్చుతో సైకిల్ మోడల్ బైక్ ను సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచాడు కర్నూలు జిల్లాకు చెందిన రాకేష్. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన శాంతిరాజు, రత్నమ్మ దంపతుల మూడో కొడుకు రాకేష్. అదరిలాగే 10వ తరగతి పాసై.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పేదరికం వెక్కిరియ్యడంతో.. బతుకుదెరువుకోసం ముంబై వెళ్లింది రాకేష్ కుటుంబం. కుటుంబ పోషణ కోసం అక్కడే ఓ మెకానిక్ షెడ్డులో పనికి చేరాడు రాకేష్. కొన్ని రోజుల పాటు అక్కడే మెకానిక్ పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చాడు. ఒక పక్క చదువుకుంటూనే.. తనకు వచ్చిన మెకానిక్ పనితో ఏదో ఒకటి తయ్యారు చేయాలన్న తపనతో ముందుకు సాగాడు. తండ్రిని కొంత డబ్బులు అడిగి, ఓ పాత సైకిల్ ను కొనుగోలు చేశాడు రాకేష్. పాత సామాన్ల దుకాణానికి వెళ్లి.. అక్కడ బైక్ కు సంబంధించిన సామాన్లను కొన్నాడు. దాదాపు 20 రోజుల పాటు కష్టపడి.. పాత సైకిల్ కు బైక్ ఇంజన్ సెట్ చేశాడు. ఆ తర్వాత సొంత గ్రామంలో బైక్ మోడల్ సైకిల్ పై రయ్ రయ్ మంటూ రోడ్లపై చక్కర్లు కొట్టాడు.

దాంతో గ్రామస్తులంత రాకేష్ టాలెంట్ ను మెచ్చుకుంటూ.. ప్రశంసలు కురిపించారు. ఇక బైక్ మోడల్ సైకిల్ ను సృష్టించడానికి తనకు కేవలం రూ. 3 వేలు మాత్రమే అయ్యిందని రాకేష్ తెలిపాడు. కాగా.. దీనిని మరింత సౌకర్యవంతగా కూడా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందని అతడు పేర్కొన్నాడు. ఇక తనకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే.. తాను తక్కువ ఖర్చుతోనే ఓ కొత్త బైక్ ను తయ్యారు చేస్తానని రాకేష్ నమ్మకంగా చెబుతున్నాడు. మరి 3 వేలకే సైకిల్ మోడల్ బైక్ ను తయ్యారు చేసిన కర్నూలు కుర్రాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రూ.20 లక్షలు పెడితే.. రూ.కోటి 70 లక్షలొచ్చాయి! కన్నీళ్లు ఆగలేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి