iDreamPost

కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అసలు నిజం?

  • Published Jan 31, 2024 | 8:30 AMUpdated Jan 31, 2024 | 8:30 AM

Kumari Aunty: కుమారి ఆంటీ షాప్‌ క్లోజ్‌ చేసిన నేపథ్యంలో.. ఈ ఘటన వెనక రాజకీయ పార్టీలు ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణాలు ఏంటి అంటే..

Kumari Aunty: కుమారి ఆంటీ షాప్‌ క్లోజ్‌ చేసిన నేపథ్యంలో.. ఈ ఘటన వెనక రాజకీయ పార్టీలు ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణాలు ఏంటి అంటే..

  • Published Jan 31, 2024 | 8:30 AMUpdated Jan 31, 2024 | 8:30 AM
కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అసలు నిజం?

కుమారి ఆంటీ.. సోషల్‌ మీడియా వాడే వారికి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీకి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కోహినూరు హోటల్ ఎదురుగా స్టాల్‌లో ఫుడ్‌ సెంటర్‌ వ్యాపారం ప్రారంభించింది. అందుబాటు ధరలోనే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తుండటంతో.. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియా వల్ల ఆమె గురించి మరింత మందికి తెలిసింది. కొందరూ యూట్యూబర్స్‌ ఆమె ఫుడ్‌ సెంటర్‌ గురించి వీడియోలు తీసి పోస్ట్‌ చేయడంతో.. చాలా పాపులర్‌ అయ్యింది. దాంతో కస్టమర్ల సంఖ్యతో పాటు.. క్రేజ్‌ కూడా పెరిగింది. తాజాగా భైరవకోన సినిమా ప్రమోషన్‌ కోసం సందీప్‌ కిషన్‌, హీరోయిన్స్‌తో కలిసి కుమారి ఆంటీ ఫుడ్‌ కోర్ట్‌ దగ్గరకు వెళ్లాడంటే.. ఆమె క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీ ఆదాయం గురించి బోలేడు వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆమె నెలకు 18 లక్షల రూపాయలు సంపాదిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో కుమారి ఆంటీకి సంబంధించిన వార్తలు తెగ వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమెకు హైదరాబాద్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ వద్దకు సాధారణ జనాలు మాత్రమే యూట్యూబర్లు, బ్లాగర్స్‌ ఎగబడటంతో.. ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది.

kumari aunty food business close

ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుండటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కుమారీ ఆంటీపై కేసు నమోదు చేసి, ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. దీంతో ఆమె వ్యాపారానికి బ్రేక్ పడింది. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారో.. అదే సోషల్ మీడియా వల్ల ఆమె బిజినెస్‌ క్లోజ్‌ అయ్యింది.

కుమారి ఆంటీ వ్యాపారం మూతపడటం ఎంత సంచలనంగా మారింది అంటే.. ఏకంగా రాజకీయ కారణాల వల్లే ఆమె బిజినెస్‌ క్లోజ్‌ చేశారనే ప్రచారం సాగుతోంది సోషల్‌ మీడియాలో. ఆమెకు వైసీపీ ప్రభుత్వం అండ ఉండటం వల్లనే.. కావాలనే కక్షగట్టి వ్యాపారం మూతపడేలా చేశారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. కుమారీ ఆంటీ మీద కేసు నమోదైతే.. అందులోకి రాజకీయ కారణాలు ఎందుకు వచ్చాయి అంటే.. గతంలో ఓ సారి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వం వల్లే తమకు ఇల్లు వచ్చిందని చెప్పింది. అదిగో ఆ మాట పట్టుకుని.. ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు కొందరు నెటిజనులు. రాజకీయ కారణాల వల్లే ఆమె షాప్‌ను క్లోజ్‌ చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కానీ వాస్తవంగా.. కుమారి ఆంటీ షాప్‌ను అక్కడి నుంచి తరలించాలని పోలీసులు ఆమెకు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ‘కుమారి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ను వారి సొంత స్థలంలో చేయడంలేదు. ఆమె షాప్‌ వద్దకు వచ్చే కస్టమర్ల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక్కడకు వచ్చే కస్టమర్లు రోడ్డుపై వాహనాలు పార్క్ చేస్తుండటంతో మిగతా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించని వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని ఆమెకు చాలా రోజుల నుంచి చెప్తున్నాం’ అన్నారు పోలీసులు.

అయితే కుమారి ఆంటీ మాత్రం.. ట్రాఫిక్‌ పోలీసులు మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి.. తన ఒక్కదాని బండిని మాత్రమే మూసేశారని ఆరోపిస్తోంది. తన ఒక్కరిపట్లే ఎందుకిలా అని ప్రశ్నిస్తున్నారు. ‘కస్టమర్లకు పార్కింగ్ సౌకర్యం చూపించాలని పోలీసులు చెప్తున్నారు. కానీ, నాకంత స్థోమత లేదు. నా ఉపాధి ఇదే.. దయచేసి నా కడుపు మీద కొట్టకండి అని ప్రాధేయపడుతుంది. ‘మొత్తానికి ట్రాఫిక్‌ సమస్య వల్ల ఆమె షాప్‌ క్లోజ్‌ చేస్తే.. దాన్ని కాస్త రాజకీయాలకు ముడిపెట్టి.. సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం చేసుకుంటున్నారు కొందరు నెటిజనులు. ఇక కుమారి ఆంటీ షాప్‌ క్లోజ్‌ చేసిన విషయం తెలిసి హీరో సందీప్‌ కిషన్‌ స్పందించాడు. ఆమెకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి