iDreamPost

CM రేవంత్ రెడ్డి స్పందించడంపై ఎమోషనలైన కుమారి ఆంటీ!

Kumari Aunty: సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్ ను పోలీసులు మూసేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరి.. అక్కడి నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో సీఎం స్పందించడంపై కుమారి ఆంటీ ఎమోషనలయ్యారు.

Kumari Aunty: సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్ ను పోలీసులు మూసేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరి.. అక్కడి నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో సీఎం స్పందించడంపై కుమారి ఆంటీ ఎమోషనలయ్యారు.

CM రేవంత్ రెడ్డి స్పందించడంపై ఎమోషనలైన కుమారి ఆంటీ!

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమం, ఎలక్ట్రానికి మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఏదైనా ఉంది అంటే.. అది కుమారి ఆంటీ, ఆమె ఫుడ్ స్టాల్. భాగ్యనగరంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన హోటల్స్ ఉన్నప్పటికీ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు.  సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు ఫుడ్ స్టాల్ కు క్యూ కడుతున్నారు. మంగళవారం ఆమె ఫుడ్ స్టాల్ ను పోలీసులు తొలగించారు. దీంతో ఈ ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరింది. త్వరలో కుమారి ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తామని సీఎంవో నుంచి ప్రకటన వచ్చింది. ఈ వార్తపై ఆమె స్పందిస్తూ ఎమోషనలయ్యారు.

కుమారి ఆంటీ.. ఈ పేరు పెద్దగా పరిచయం చెయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె వీడియోలే ట్రేండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నెట్టింటా తెగ వైరల్  అయింది. ఇనార్భిట్ మాల్ సమీపంలో ఆమె ఈ ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇక నిత్యం వందలాది మంది ఫుడ్ లవర్స్ కుమారి ఆంటీ అందించే ఫుడ్ అక్కడి వెళ్తుంటారు. ఈనేపథ్యంలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే మంగళవారం కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు.

Kumari's first reaction on CM's reaction

ఇక ఈ వార్త కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీంతో ఆమెకు మద్దతుగా చాలా మంది పోస్టులు పెడుతున్నారు.  కొందరు అయితే పోలీసుల తీరును ప్రశ్నించారు. అక్కడ అంత మంది ఉంటే.. కేవలం కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్ ను మాత్రమే ఎందుకు సీజ్‌ చేశారంటూ ప్రశ్నించారు.  మరికొందరు దీనికి రాజకీయ కారణాలను ఆపాదించారు. ఇలా సోషల్‌ మీడియాలో కుమారి ఆంటీ వివాదంపై పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. కుమారి హోటల్ సీజ్ చేయొద్దని.. పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక త్వరలో ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తామని సీఎంవో ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది.

ఇక తన ఇష్యూపై సీఎం రేవంత్ స్పందించడంపై కుమారీ ఆంటీ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ..తనలాంటి సామాన్యురాలి విషయంలో అంతపెద్ద వ్యక్తి స్పందించడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తాము మళ్లీ హోటల్ పెడతామని అనుకోలేదన్నారు. తన విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కుమారి ఆంటీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి సీఎం స్పందించడం గొప్ప విషయం, తనకు ఆనందభాష్పాలు వస్తున్నాయంటూ ఆంటీ ఎమోషనలయ్యారు. మరి.. సీఎం రేవంత్ నిర్ణయంపై కుమారి ఆంటీ ఇచ్చిన రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి