iDreamPost

TS: అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్.. సామాన్యుడి ఇంట్లో డిన్నర్

  • Published Jan 08, 2024 | 1:33 PMUpdated Jan 08, 2024 | 1:33 PM

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి అందరికి తెలిసిందే. ఈయన రాజకీయాల్లోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా అభిమానులకు దగ్గరగా ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ నేటిజన్ అడిగిన కోరిక తీర్చేందుకు కేటీఆర్ చేసిన పనికి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి అందరికి తెలిసిందే. ఈయన రాజకీయాల్లోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా అభిమానులకు దగ్గరగా ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ నేటిజన్ అడిగిన కోరిక తీర్చేందుకు కేటీఆర్ చేసిన పనికి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jan 08, 2024 | 1:33 PMUpdated Jan 08, 2024 | 1:33 PM
TS: అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్.. సామాన్యుడి ఇంట్లో డిన్నర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి అందరికి తెలిసిందే.ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ప్రజలకు సేవలు అందిస్తూ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక గతేడాది జరిగిన అసేంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే అధికారంలో లేకపోయినా ఒక ప్రజ నాయకుడిగా ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎదుటి వ్యక్తి కష్టాన్ని సైతం అర్థం చేసుకోని సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి కేటీఆర్. ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతలో ఓ నెటిజన్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కేటీఆర్ ప్రజా పరిపాలనా విధానంలో ఎంతో చాకాచక్యంగా చురుకుగా వ్యవహరిస్తారో అందరికి తెలిసిందే. ఇదే విధాంగా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోడంలో కేటీఆర్ ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచారు. ఇటీవలే కొత్త సంవత్సరం సందర్భంగా సామాజిక మాధ్యమంలో ఓ అభిమాని కేటీఆర్ కు శుభకాంక్షలు చెప్పడంతో పాటు.. భోజనానికి ఇంటికి పిలిచాడు. దీంతో ఆ అభిమాని అడిగిన కోరికను స్పందించిన కేటీఆర్.. కచ్చితంగా వస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే.. ఇచ్చిన మాటను తప్పకుండా, మర్చిపోకుండా.. ఆదివారం ఆ సామాన్యుడి ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్య పరచారు. ఇక ఆ కుటుంబంతో కలిసి భోజనం చేసి వారి ముఖాల్లో చిరునవ్వును నింపారు.

ktr dinner in his fan house

కాగా, కేటీఆర్ కు భోజనంకు ఆహ్వనించీన వ్యక్తి బోరబండకు చెందిస గాజుల దుకాణదారుడు ఇబ్రహీం ఖాన్ అని సమాచారం తెలిసింది. ఇతడు కొత్త సంవత్సరం సందర్భంగా.. కేటీఆర్ కు శుభకాంక్షలు తెలియజేశాడు. అంతేకాకుండా గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజల అభివృద్ధి కోసం పగలు రాత్రి తేడా లేకుండా ఎంతోగానో కష్టపడ్డారని ప్రశంసించారు. అయితే దురదృష్టవాశాత్తు ఎన్నికల్లో పరాజయం పోందరని, కాగా, ఈ ఐదేళ్ల కాలం ఒక ఇంటర్వెల్ లాగా గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ చెప్పుకొచ్చారు. అలాగే పదేళ్ల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతికగా తన ఇంట్లో అతిథ్యం స్వీకరించాలని ఇబ్రహీం కోరాడు.

ఇచ్చిన మాట మేరకు ఆదివారం బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు . ఇక ఇబ్రహీం ఖాన్ కుటుంబ సమేతంగా కేటీఆర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. దివ్యంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేస్తే.. వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్‌కి ఇబ్రహీం ఖాన్ కుటుంబం గుర్తు చేశారు. అలాగే ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇబ్రహీం ఖాన్ పిల్లలకు చెవుడు ఉన్నందున వారికి అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే.. కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఉన్నారు. ఇక కేటీఆర్ బోరబండకి రావడంతో వందల మంది ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇబ్రహీంఖాన్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి, ఒక సామాన్యుడి ఇంటకి వెళ్లి అతిథ్యం పుచ్చుకున్న కేటీఆర్ సింపుల్ సిటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి