iDreamPost

వర్షాలతో పంట నష్టపోయిన రైతులు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన!

Komatireddy Key Announcement: తెలంగాణలో ఒక్కసారే వాతావరణంలో మార్పులు సంభవించి అకాల వర్షాలు కురిశాయి. దీంతో కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో రైతులు లబో దిబో అంటున్నారు.

Komatireddy Key Announcement: తెలంగాణలో ఒక్కసారే వాతావరణంలో మార్పులు సంభవించి అకాల వర్షాలు కురిశాయి. దీంతో కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో రైతులు లబో దిబో అంటున్నారు.

వర్షాలతో పంట నష్టపోయిన రైతులు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన!

గత మూడునాలుగు రోజుల నుంచి తెలంగాణలో పలు చోట్ల వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల కారణంగా కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది యాసంగి పంటలు చేతికొచ్చే దశలో హఠాత్తుగా వర్షాలు పడటంతో రైతులను తీవ్రంగా దెబ్బకొట్టింది. మూడు రోజులుగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈదరుగాలులుల, వడగండ్ల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వివరాల్లోకి వెళితే..

రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మూడు రోజులుగా ఊదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాల కారణంగా కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలో దాదాపు 38 వేల ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజోన్న, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరై అధైర్య పడవొద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు.

ఈ సందర్బంగా నష్టపోయిన రైతుల విషయంలో వ్యాపారులు కూడా అన్ని విధాలుగా సహకరించాల్సిందిగా కోరారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వ్యాపారులకు సూచించారు. ఒకవేళ రైతులను మోసం చేసి కనీస మద్దతు ధర ఇవ్వకుంటే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చెప్పినా తీరు మార్చుకోని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి