iDreamPost

అర్జున్ కూతురి రిసెప్షన్‏లో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ఒక స్టార్ హీరో కూతురు

  • Published Jun 18, 2024 | 11:18 AMUpdated Jun 18, 2024 | 11:18 AM

ఇటీవలే అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతిల వివాహ రిసెప్షన్ లో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఒక స్టార్ హీరో, హీరోయిన్ల గారాల పట్టి. హీరోయిన్లకు మించిన అందంతో అందర్నీ మంత్రముగ్దులు చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

ఇటీవలే అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతిల వివాహ రిసెప్షన్ లో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఒక స్టార్ హీరో, హీరోయిన్ల గారాల పట్టి. హీరోయిన్లకు మించిన అందంతో అందర్నీ మంత్రముగ్దులు చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

  • Published Jun 18, 2024 | 11:18 AMUpdated Jun 18, 2024 | 11:18 AM
అర్జున్ కూతురి రిసెప్షన్‏లో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ఒక స్టార్ హీరో కూతురు

స్టార్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట ఇటీవలే పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. కాగా, అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ తాజాగా తాను ఇష్టపడిన వ్యక్తితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అయితే లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య వివాహం జరిగింది. ఇక ఈ వివాహ వేడుక జూన్ 10వ తేదీ చెన్నైలోని గెరుగంబాక్కంలో హనుమాన్ దేవాలంయంలో ఘనంగా జరిగింది. ఇక వీరి విహహంకు పలువురు హాజరయ్యి వధు వరులును ఆశ్వీరాదించారు. ఇకపోతే మొన్న అనగా జూన్ 14వ తేదీ శుక్రవారం నాడు అతికొద్ది మంది బంధువుల సమక్షంలో చెన్నై లీలా ప్యాలెస్‏లో వీరి రిసెప్షన్ నిర్వహించారు.

ఇక ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, ఖుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ స్నేహా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకలో ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అవును.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఈ ఫోటోలో ఐశ్వర్య పక్కనే బ్లాక్ ట్రెండీ ట్రెడిషనల్ వేర్‏లో సరదాగా నవ్వుతూ కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఓ స్టార్ హీరో గారాలపట్టి. ఇక ఆ బ్యూటీ తల్లి కూడా ఓ స్టార్ హీరోయిన్ కావడం విశేషం.

పైగా ఇండస్ట్రీలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు తమకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా.. ఆమె మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ముద్దుల కూతురు ‘అనౌష్క’. ఈమె తన తల్లి షాలిని తో అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతి రిసెప్షన్ లో సందడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మొదటిసారి తన తల్లితో కలిసి ఇలా మీడియా ముందుకు వచ్చింది అనౌష్క  చూసిన నెటిజన్స్, అజిత్ ఫ్యాన్స్.. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. హీరోయిన్స్ కంటే ఎంతో అందంగా, అమాయకంగా కనిపిస్తూ అందర్నీ  ఫిదా చేసింది ఈ అమ్మాడు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, అజిత్ కూతురు అనౌష్క లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి