iDreamPost

Koffee With Karan 7: షోలో సమంతను ఎత్తుకొని తీసుకొచ్చిన అక్షయ్ కుమార్ , నెటిజన్లు ట్రోల్ మొద‌లుపెట్టారు

Koffee With Karan 7: షోలో సమంతను ఎత్తుకొని తీసుకొచ్చిన అక్షయ్ కుమార్ , నెటిజన్లు ట్రోల్ మొద‌లుపెట్టారు

కాఫీ విత్ కరణ్ ప్రోమో మొద‌లుకాగానే, అక్షయ్, సమంత(Samantha Ruth Prabhu)ను షోలోకి ఎత్తుకొని తీసుకొస్తాడు. సోఫోలా కూర్చోబెడ‌తాడు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ చాలామంది యూజ‌ర్ల‌కు న‌చ్చ‌లేదు.

కాఫీ విత్ కరణ్ 7(Koffee With Karan 7) సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా జ‌రిగిన సీజ‌న్స్ ఒకెత్తు, ఈ సెవ‌న్త్ సీజ‌న్ మ‌రో ఎత్తు. హోస్ట్ కరణ్ జోహార్ ని ప్రతి ఎపిసోడ్ తర్వాత నెట్ లో కుమ్మేస్తున్నారు. ముందు అలియా భట్ కంటే రణవీర్ సింగ్‌కు స‌పోర్ట్ గా ఉన్నందుకు ట్రోల్ చేస్తే, ఆ తరువాత సారా అలీ ఖాన్‌(Sara Ali Khan)ను చిన్న‌చూపు చూసి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌( Janhvi Kapoor)ను ప్ర‌మోట్ చేసినందుకు క‌ర‌ణ్ ను తిట్టిపోశారు. బిచీ అంకుల్ (bitchy uncle) అని క‌ర‌ణ్ జోహార్ కు పేరుపెట్టారు.


ఇక స‌మంత‌, అక్ష‌య్ కుమార్ ఎపిసోడ్ ప్రోమోతో క‌ర‌ణ్ బ‌తికిపోయాడు. ఇప్పుడు ట్రోల‌ర్స్ ఫోక‌స్ అంతా క‌ర‌ణ్ మీద నుంచి సమంతపైకి మారింది. ప్రోమో మొద‌ట్లోనే అక్షయ్, సమంతను ఎత్తుకొని సోఫా మీదకు తీసుకువస్తాడు. అంతే, స‌మంత ఫ్యాన్స్ కు ఒళ్లుమండిపోయింది.

ఈ ప్రోమో వైరల్ అయిపోయింది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సామ్ చాలా యాక్టివ్ గా మారింద‌ని, ఓపెన్ అయిపోయింద‌ని నెట్ జ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి చాలా కామ‌న్. కాని స‌మంత ఫ్యాన్స్ మాత్రం చాలా హార్ట్ అయిన‌ట్లున్నారు. షో తర్వాత, సామ్ తన ఇమేజ్‌ను పాడు చేసుకుంద‌ని ఒక యూజ‌ర్ తెగ బాధ‌ప‌డిపోయాడు. ఇంకొడు అక్షయ్ గురించి ప్ర‌స్తావిస్తూ, త్వ‌ర‌లో మరొక విడాకులు వస్తాయని నేను ఊహిస్తున్నానని కామెంట్ పోస్ట్ చేశాడు.

అక్ష‌య్, స‌మంతల మ‌ధ్య కెమిస్ట్రీ ప‌టాసుల్లా పేలింది. ఇక‌ షో స్ట్రీమింగ్ అయిన‌ త‌ర్వాత, ఈ ఎపిసోడ్ ట్రెండ్ అవ‌డం ఖాయం. ఊ అంటావా, ఊహూ అంటా సాంగ్ స్టైల్ ను అనుక‌రించి, అక్ష‌య్ డాన్స్ చేయ‌డం ఈ ఎపిసోడ్ హైలెట్.

అక్ష‌య్ స‌మంత‌ను చేతుల్లో ఎత్తుకొని తీసుకొనిరావ‌డాన్ని కరణ్ జోహార్ హైలైట్ చేశాకాని, సమంతా మాత్రం ఫిర్యాదు ఏం చేయలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి