Somesekhar
టీమిండియాను బ్యాడ్ లక్ వదలడం లేదు.. ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ లకు జట్టులోకి వస్తాడనుకున్న ప్లేయర్ అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
టీమిండియాను బ్యాడ్ లక్ వదలడం లేదు.. ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ లకు జట్టులోకి వస్తాడనుకున్న ప్లేయర్ అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఇంగ్లాండ్ తో జరగనున్న మిగిలిన 3 టెస్ట్ మ్యాచ్ లకు టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అందరూ అనుకున్నట్లుగానే భారత స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో సిరీస్ కు దూరమైయ్యాడు. ఇది జట్టుకు భారీ ఎదురుదెబ్బ. అయితే కోహ్లీ లేని లోటును భర్తీ చేస్తాడనుకున్న ఓ స్టార్ ప్లేయర్ టీమ్ లో చోటు దక్కించుకున్నప్పటికీ.. మూడో టెస్ట్ లో ఆడటం అనుమానంగానే మారింది. తాజాగా ఈ విషయం తెలియడంతో.. టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంతకీ 3వ టెస్ట్ కు దూరం కానున్న ఆ ప్లేయర్ ఎవరు?
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియాను బ్యాడ్ లక్ వదలడంలేదు. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఇద్దరూ గాయపడ్డారు. దీంతో వీరిద్దరు రెండో టెస్ట్ కు దూరమైయ్యారు. అయితే తాజాగా ప్రకటించిన టీమ్ లో వీరికి చోటు కల్పించడంతో.. వీరు ఆడతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మూడో టెస్ట్ కు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడని తెలుస్తోంది. అతడు పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో.. రాహుల్ ప్లేస్ లో యువ ఆటగాడు దేవ్ దత్ పడిక్కల్ ను టీమ్ లోకి తీసుకోనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది.
కాగా.. మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించే ముందే ఓ విషయాన్ని చెప్పింది బీసీసీఐ. ఎన్సీఏ నుంచి జడేజా, రాహుల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే వీరిద్దరు ఆడతారు అని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రాహుల్ ప్రాక్టీస్ మెుదలు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతడు నెక్ట్స్ మ్యాచ్ లో బరిలోకి దిగి భారీ స్కోర్లు సాధించడం ఖాయమని అభిమానులు ఆశించారు. కానీ అనుకోని విధంగా అతడు ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఈనెల 15 నుంచి రాజ్ కోట్ వేదికగా మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. గాయాలతో టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్ ఎప్పటికి వదులుతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
KL Rahul out of the 3rd Test against England.
Devdutt Padikkal replaces him in the squad. (Express Sports). pic.twitter.com/wnvpgAmB2P
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024
ఇదికూడా చదవండి: Virat Kohli: టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ దూరం! సిగ్గుచేటంటూ స్టువర్ట్ బ్రాడ్ షాకింగ్ కామెంట్స్!