iDreamPost
android-app
ios-app

IND vs SA: KL రాహుల్ గొప్ప మనసు.. మ్యాచ్ తర్వాత..

భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. అతడు చేసిన పనికి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. అతడు చేసిన పనికి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

IND vs SA: KL రాహుల్ గొప్ప మనసు.. మ్యాచ్ తర్వాత..

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది టీమిండియా. ఇక ఈ టూర్ లో భాగంగా జరిగిన టీ20 సిరీస్ ను ఇరు జట్లు 1-1తో సమంగా పంచుకున్నాయి. తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శాంసన్ సెంచరీ చేయడంతో 78 రన్స్ తో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. అతడు చేసిన పనికి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంతకీ రాహుల్ చేసిన ఆ పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేఎల్ రాహుల్.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న స్టార్ బ్యాటర్లలో ఒకడు. ఇటు తాత్కాలిక కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా భారత జట్టుకు తన సేవలను అందిస్తూ వస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు కేఎల్ రాహుల్ తన ఉదార మనసును చాటుకుంటూ ఉంటాడన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేసిన రాహుల్ తాజాగా సౌతాఫ్రికాతో పర్యటనలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. సాధారణంగా మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు అభిమానులకు ఆటోగ్రాఫ్ లతో పాటుగా కొన్ని కొన్ని గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు.

KL Rahul's great mind

తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్ తర్వాత టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ ఓ అభిమానికి తన ఫ్యాడ్స్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాడంతో.. రాహుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మీ గొప్ప మనసును మరోసారి ప్రపంచానికి తెలియపరిచారు అంటూ కితాబిస్తున్నారు. గతంలో కూడా రాహుల్ ఇలాంటి ఎన్నో బహుమతులు ఫ్యాన్స్ కు ఇచ్చాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(52) రాణించాడు. అనంతరం 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 45.5 ఓవర్లకు 218 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఓపెనర్ టోనీ డి జోర్జీ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ 4 వికెట్లతో సత్తాచాటాడు. మరి ఫ్యాన్ కు కేఎల్ రాహుల్ తన ఫ్యాడ్స్ గిఫ్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి